Sharpen Your Child’s Memory: మీ పిల్లల మెమరీ షార్ప్‌ చేసే అద్భుత చిట్కాలు.. మెదడు పదునెక్కాలంటే ఇవి చేయాల్సిందే

పిల్లల జ్ఞాపకశక్తి వారికి వచ్చే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఎడ్యుకేషన్‌, వ్యక్తిగత ఎదుగుదలకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఇంత విలువైన జ్ఞాపకశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం..

Sharpen Your Child's Memory: మీ పిల్లల మెమరీ షార్ప్‌ చేసే అద్భుత చిట్కాలు.. మెదడు పదునెక్కాలంటే ఇవి చేయాల్సిందే
Tips To Boost Your Child's Memory
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 02, 2024 | 9:27 PM

పిల్లల జ్ఞాపకశక్తి వారికి వచ్చే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఎడ్యుకేషన్‌, వ్యక్తిగత ఎదుగుదలకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఇంత విలువైన జ్ఞాపకశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన ఆహారం

పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని పిల్లలకు అందించాలి. సాల్మన్ చేపలు, వాల్‌నట్స్ వంటి వాటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే పండ్లు, కూరగాయల నుంచి లభించే యాంటీఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తికి తోడ్పడతాయి.

ఫిజికల్‌ యాక్టివిటీస్‌

శారీరక శ్రమ శరీరానికి మాత్రమే కాదు, మెదడుకు కూడా చాలా అవసరం. రెగ్యులర్ వ్యాయామం చేస్తే మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా అందుతుంది. మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిల్లలు చురుగ్గా ఉండాలంటే ఆటలు ప్రోత్సహించాలి.

ఇవి కూడా చదవండి

నిద్ర

మెదడుకు తగినంత నిద్ర కూడా అవసరమే. కాబట్టి మీ పిల్లలు వారి వయస్సుకి తగిన విధంగా నిద్ర పోతున్నారో.. లేదో.. నిర్ధారించుకోవాలి. పిల్లలు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించేలా చూసుకోవాలి. వారి పడకగదిలో నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి.

స్క్రీన్ టైమ్ బ్యాలెన్స్

ఎక్కువ స్క్రీన్ సమయం మెమరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. టీవీ, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై పిల్లలకు పరిమితులను సెట్ చేయాలి. ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్‌లో ఎడ్యుకేషనల్ కంటెంట్, ఇంటరాక్టివ్ యాప్‌ వంటివి పిల్లలు వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే క్రియాశీల అభ్యాసం చాలా కీలకం. పజిల్స్, మెమరీ గేమ్‌లు వంటి జ్ఞాపకశక్తిని పెంచే ఆటపాటలు పిల్లలకు నేర్పించాలి. ఈ చర్యలు వారి మెదడును ఉత్తేజపరుస్తాయి.

సోషల్‌ ఇంటరాక్షన్‌

సహ విద్యార్ధులు, కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలి, వారితో ఎలా మాట్లాడాలి వంటి విషయాలు కూడా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. గ్రూప్‌ యాక్టివిటీస్‌, డిస్కషన్స్‌ ప్రోత్సహించాలి. ఇలాంటి సోషల్ బిహేవియర్‌ పిల్లల జ్ఞాపకశక్తి, అభిజ్ఞా నైపుణ్యాలకు పదును పెడుతుంది.

స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్

పిల్లలకు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్ పద్ధతులను నేర్పించాలి. అధిక ఒత్తిడి స్థాయిలు జ్ఞాపకశక్తి పనితీరును దెబ్బతీస్తాయి. శ్వాస వ్యాయామాలు, రిలాక్సేషన్‌ టెక్నిక్‌లు, ఓపెన్‌ కమ్యునికేషన్‌ వంటివి పిల్లల్లో స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌కు సహాయపడతాయి.

ప్రతి చైల్డ్‌ ప్రత్యేకమైననవారే. వారి కంటూ ప్రత్యేక ట్యాలెంట్‌ ఉంటుంది. కాబట్టి మీ పిల్లల వయస్సు, ఆసక్తులకు అనుగుణంగా ఈ చిట్కాలను ఉపయోగించండి. పేరెంటింగ్‌లో వీటిని పాటించడం ద్వారా మీ పిల్లల జ్ఞాపకశక్తిని పెంపొందించడంతోపాటు పిల్లలతో మీ అనుబంధం మరింత బలంగా మారుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.