Lifestyle: ఎత్తైన దిండును ఉపయోగిస్తున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..
వైద్యులు ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన మంచం మీద పడుకోవాలని సిఫార్సు చేస్తారు. తద్వారా నిద్రించే సమయంలో శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చక్కగా నిద్రపోవచ్చు. అయితే కొందరు మాత్రం ఒకటి కంటే ఎక్కువ దిండులను ఉపయోగిస్తుంటారు. ఎత్తైన దిండుతో నిద్రించే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే...
నిద్రపోయే సమయంలో దిండును ఉపయోగించడం మనలో చాలా మందికి ఉండే అలవాటే. మనలో చాలా మందికి దిండులేకపోతే అసలు నిద్ర కూడా పోని పరిస్థితి ఉంటుంది. అయితే మంచి నిద్రకు దిండు ఉపయోగపడుతుందని వైద్యులు సైతం సూచిస్తుంటారు. అయితే తల దిండు విషయంలో చేసే కొన్ని తప్పులు మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ తల దిండు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్యులు ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన మంచం మీద పడుకోవాలని సిఫార్సు చేస్తారు. తద్వారా నిద్రించే సమయంలో శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చక్కగా నిద్రపోవచ్చు. అయితే కొందరు మాత్రం ఒకటి కంటే ఎక్కువ దిండులను ఉపయోగిస్తుంటారు. ఎత్తైన దిండుతో నిద్రించే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనేక ఆరోగ్య సమస్యలకు ఎత్తైన తల దిండు కారణమని చెబుతున్నారు. ఎత్తైన దిండుతో పడుకోవడం అంటే రోగాలను ఆహ్వానిస్తున్నట్టేనని చెబుతున్నారు. మెడ ఆరోగ్యానికి ఇది హానికరమని చెబుతున్నారు. తలదిండు ఎత్తు ఎక్కువగా ఉంటే భుజం, మెడ కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల మెడ నొప్పి, దృఢత్వం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా తల వెనుక భాగంలో సమస్యలు వస్తాయి. కాబట్టి ఎత్తైన దిండుకు దూరంగా ఉండడమే ఉత్తమం.
ఎత్తైన దిండును ఉపయోగించడం వల్ల వెన్నెముక సమస్యలు వస్తాయి. నిజానికి మనం చాలా దిండుతో నిద్రిస్తున్నప్పుడు శరీర భంగిమ చెదిరిపోతుంది. ఇది వెన్నుపాము దెబ్బతినడంతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా దిండు ఎత్తుగా ఉంటే.. ముఖం, దిండు మధ్య ఘర్షణకు కారణమవుతుంది, ఇది చర్మంపై మొటిమలు, ముడతలు రావడానికి కారణమవుతుంది. ఇది మీ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. అలాగే దిండును చాలా ఎత్తుగా ఉంచడం వల్ల తలనొప్పి వస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..