AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరల్లో ఉప్పు ఎక్కువైతే బీపీ మాత్రమే కాదు.. మీ ఒంట్లో ఈ పార్ట్‌ కూడా మటాష్‌

ఉప్పు లేకుండా ఏ వంటంకం పూర్తికాదు. అయితే దీనిని పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. అదే అధికంగా తీసుకోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఉప్పును మితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉప్పు అధికంగా తీసుకుంటే..

కూరల్లో ఉప్పు ఎక్కువైతే బీపీ మాత్రమే కాదు.. మీ ఒంట్లో ఈ పార్ట్‌ కూడా మటాష్‌
Side Effects Of High Salt Intake
Srilakshmi C
|

Updated on: Apr 30, 2026 | 4:04 PM

Share

ఉప్పు మన రోజువారీ ఆహారంలో కీలకమైన భాగం. ఉప్పు లేకుండా ఏ వంటంకం పూర్తికాదు. అయితే దీనిని పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. అదే అధికంగా తీసుకోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఉప్పును మితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో కాల్షియం లోపం తలెత్తుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అసలు ఉప్పు, కాల్షియం మధ్య సంబంధం ఏమిటి? ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది? ఈ సమస్యను నివారించడానికి ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఉప్పు – కాల్షియం మధ్య సంబంధం ఏమిటి?

బలమైన ఎముకలు, దంతాలకు కాల్షియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది నరాలు, కండరాల సరైన పనితీరుకు కూడా ఎంతో ముఖ్యం. అయితే, అధికంగా ఉప్పు తీసుకోవడం శరీరంలోని ఖనిజాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా విసర్జించబడే కాల్షియం పరిమాణం పెరుగుతుందని వెల్లడించాయి. అంతేకాకుండా, ఎక్కువ కాలం పాటు అధికంగా ఉప్పు తీసుకోవడం ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య ముఖ్యంగా కాల్షియం లోపం ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?

వృద్ధులు, మహిళలు ఇప్పటికే కాల్షియం లోపంతో బాధపడుతున్నవారు ఉప్పు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. హార్మోన్ల మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

ఎలా నియంత్రించాలి?

అందుకే ఉప్పు వాడకాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తగ్గించాలి. అంతేకాకుండా పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఉప్పును మితంగా వాడటం, సమతుల్య ఆహారం తీసుకోవడం శరీరంలోని ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. సరైన జీవనశైలి ద్వారా కాల్షియం లోపం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us