AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ, కాఫీ ఇలా తాగితే విషమే.. మీరు చేసే ఈ తప్పులతో మీ బాడీ షెడ్డుకే..

ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ లేదా కాఫీ కప్పుతో రోజును ప్రారంభించడం మనలో చాలామందికి ఉన్న అలవాటు. అయితే ఆ ఒక్క కప్పు కెఫిన్ మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుందని మనం అనుకుంటాం కానీ అది తెలియకుండానే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని మీకు తెలుసా? ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీ, కాఫీ ఇలా తాగితే విషమే.. మీరు చేసే ఈ తప్పులతో మీ బాడీ షెడ్డుకే..
Drinking Tea On Empty Stomach
Krishna S
|

Updated on: Jan 14, 2026 | 8:54 AM

Share

చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ లేదా స్ట్రాంగ్ కాఫీ తాగనిదే రోజు గడవదు. ఆ కప్పు కెఫిన్ పడకపోతే పనిలో వేగం రాదని భావిస్తారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం నిద్రలేవగానే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో కెఫిన్ తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.

ఖాళీ కడుపుతో తాగితే ప్రమాదమే

ఉదయం పరగడుపున టీ, కాఫీలు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కెఫిన్ కడుపులోని లైనింగ్‌ను ఇబ్బంది పెట్టి అజీర్ణానికి దారితీస్తుంది. అందుకే ఉదయం లేవగానే ఏదైనా చిన్నపాటి ఆహారం తీసుకున్న తర్వాతే టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యకరం.

గ్రీన్ టీ: అమృతమా? విషమా?

గ్రీన్ టీ బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి మంచిదని అందరూ భావిస్తారు. కానీ అది తాగే సమయం చాలా ముఖ్యం. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని టానిన్లు కడుపులో చికాకును కలిగిస్తాయి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీ సరిపోతుంది. అతిగా తాగడం వల్ల నిద్రలేమి, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు రావచ్చు. రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందే దీన్ని ముగించాలి.

బ్లాక్ టీతో బోలెడు లాభాలు

బ్లాక్ టీ, గ్రీన్ టీలలో ఉండే పాలీఫెనాల్స్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. రెగ్యులర్‌గా బ్లాక్ టీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ఎముకలను దృఢపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణనిస్తాయి.

మీరు ఏ రకమైన టీ తాగినా, అది మితంగా, సరైన సమయంలో తీసుకుంటేనే మందులా పనిచేస్తుంది. అతిగా తాగితే అమృతమైనా విషమే అన్నట్లుగా.. మీ టీ అలవాట్లను మార్చుకుని రోజంతా ఉత్సాహంగా ఉండండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మామిడి పండ్లు కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త! కెమికల్స్‌లేని పండ్ల
మామిడి పండ్లు కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త! కెమికల్స్‌లేని పండ్ల
తండ్రి ప్రొడ్యుసర్.. మేనమామ చిరంజీవి.. అయిన తప్పని రిజెక్షన్స్..
తండ్రి ప్రొడ్యుసర్.. మేనమామ చిరంజీవి.. అయిన తప్పని రిజెక్షన్స్..
ఇంట్లోకొచ్చి బుసలు కొట్టిన నాగుపాము.. గూస్‌బంప్స్ వీడియో
ఇంట్లోకొచ్చి బుసలు కొట్టిన నాగుపాము.. గూస్‌బంప్స్ వీడియో
గ్రహాల గేమ్ ఛేంజ్.. వారికి అదృష్ట యోగంతో దరిద్రం పరార్
గ్రహాల గేమ్ ఛేంజ్.. వారికి అదృష్ట యోగంతో దరిద్రం పరార్
బుమ్రాను ఉతికారేసిన బుడ్డోడు.. రోహిత్, హార్దిక్ మైండ్ బ్లాక్..
బుమ్రాను ఉతికారేసిన బుడ్డోడు.. రోహిత్, హార్దిక్ మైండ్ బ్లాక్..
బాదం పప్పులు ఇలా తిన్నారంటే బంపర్‌ బెనిఫిట్స్‌...అద్భుతమైన ఆరోగ్య
బాదం పప్పులు ఇలా తిన్నారంటే బంపర్‌ బెనిఫిట్స్‌...అద్భుతమైన ఆరోగ్య
కొత్త టోల్ ఛార్జీ రూల్స్.. ఇక నుంచి ఆ కార్డ్ చెల్లనే చెల్లదు
కొత్త టోల్ ఛార్జీ రూల్స్.. ఇక నుంచి ఆ కార్డ్ చెల్లనే చెల్లదు
ఆకలితో ఒక టీ కోసం ఎదురు చూసిన రోజుల నుంచి..
ఆకలితో ఒక టీ కోసం ఎదురు చూసిన రోజుల నుంచి..
చుట్టాలొస్తే కొబ్బరి పాల అన్నం ఇలా చేసి పెట్టండి..
చుట్టాలొస్తే కొబ్బరి పాల అన్నం ఇలా చేసి పెట్టండి..
ఎన్టీఆర్ మూవీపై ప్రశాంత్ నీల్ పోస్ట్..
ఎన్టీఆర్ మూవీపై ప్రశాంత్ నీల్ పోస్ట్..