Tomato: టమాటా తరుచుగా తింటున్నారా.. అయితే ఇవి విషయాలు తెలుసుకోండి..

ఈ మధ్య ప్రతి కూరలో టమాటా వేయడం కామన్ అయింది. చివరికి చికెన్ వండినా అందులో టమాటా వేస్తున్నారు.

Tomato: టమాటా తరుచుగా తింటున్నారా.. అయితే ఇవి విషయాలు తెలుసుకోండి..
Tomato
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 17, 2022 | 7:45 AM

ఈ మధ్య ప్రతి కూరలో టమాటా వేయడం కామన్ అయింది. చివరికి చికెన్ వండినా అందులో టమాటా వేస్తున్నారు. అందుకే కూరగాయాల్లో టమాటాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక బయట రెస్టారెంట్లు, బేకరీల్లో టమాటా సాస్ తప్పనిసరి అయిపోయింది. కర్రీల్లో గ్రేవీ, టెస్ట్ కోసం టమాటాను కొందరు అధికంగా వినియోగిస్తుంటారు. టమాటా చూసేందుకు ఎరుపుగా ఆకర్షిస్తుంది. శరీర డైట్ మెయింటెన్ చేసేవారు పచ్చి టమాటాలను కూడా తింటుంటారు.

సాధారణంగా మనం ఇంట్లో టమాటాను అధికంగా వినియోగిస్తుంటాము. కూరలు, సూప్స్ కోసం విరివిగా వాడుతుంటాము. అయితే టామాటోను ఎక్కువగా తినడం వలన మూత్రపిండాల్లో రాళ్ల సంఖ్య పెరుగుతుందని, లేనివారికి కొత్తగా వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టమాటాలో ఆగ్జాలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్స్, కాల్షియంతో పాటు ఆగ్జాలిన్ అనేది మన బాడీలోని యూరిక్ యాసిడ్‌తో కలిసినప్పుడు చెడు జరిగే అవకాశం ఉంది. ఆగ్జాలిన్‌ను యూరిక్ యాసిడ్ శోషించుకోవడం వల్ల కిడ్నీల్లో చిన్నగా రాళ్లలాగా ఏర్పడుతాయి. క్రమంగా ఇవి పెద్దగా అవ్వడం ద్వారా మూత్రానికి అడ్డు పడతాయి.

దీంతో మూత్రం పోసేటప్పుడు విపరీతమైన మంట, నొప్పికలుగుతాయి. వీటిని తొలగించకపోతే శరీరంలో నీటి స్థాయి పెరిగి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. కొంతకాలానికి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు టామాటాను తక్కువగా తీసుకోవాలి. బీపీ, డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు కూడా టమాటాను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీల్లో రాళ్లు రావడానికి లేదా వాటి ఎదుగుదలకు ఆగ్జాలిన్ అనేది చాలా ప్రోత్సహిస్తుంది.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Ashwagandha: అశ్వగంధతో అదిరిపోయే ప్రయోజనాలు.. మెమొరీ నుంచి బరువు తగ్గేవరకు బోలెడన్నీ లాభాలు