AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutmeg for Immunity: ఇమ్యూనిటీని పెంచే జాపత్రి.. వర్షా కాలంలో తినడం బెస్ట్..

జాపత్రి అనగానే చాలా మందికి గుర్తొచ్చేది బిర్యానీ. సుగంధ ద్రవ్యాల్లో జాపత్రి కూడా ఒకటి. పులావ్ తయారు చేయడానికి జాపత్రి అనేది ఖచ్చితంగా కావాలి. బిర్యానీ దినుసుల్లో ఇది కూడా ఒకటి. అంతే కాకుండా ఇతర వంటకాల్లో కూడా జాపత్రిని ఉపయోగిస్తూ ఉంటారు. జాపత్రి తీసుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువగా మసాలా వంటకాల్లో జాపత్రిని వినియోగిస్తారు. జాపత్రి చాలా ఘాటుగా ఉంటుంది. అంతే విధంగా వంటకాలకు..

Nutmeg for Immunity: ఇమ్యూనిటీని పెంచే జాపత్రి.. వర్షా కాలంలో తినడం బెస్ట్..
Nutmeg
Chinni Enni
|

Updated on: Aug 09, 2024 | 7:12 PM

Share

జాపత్రి అనగానే చాలా మందికి గుర్తొచ్చేది బిర్యానీ. సుగంధ ద్రవ్యాల్లో జాపత్రి కూడా ఒకటి. పులావ్ తయారు చేయడానికి జాపత్రి అనేది ఖచ్చితంగా కావాలి. బిర్యానీ దినుసుల్లో ఇది కూడా ఒకటి. అంతే కాకుండా ఇతర వంటకాల్లో కూడా జాపత్రిని ఉపయోగిస్తూ ఉంటారు. జాపత్రి తీసుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువగా మసాలా వంటకాల్లో జాపత్రిని వినియోగిస్తారు. జాపత్రి చాలా ఘాటుగా ఉంటుంది. అంతే విధంగా వంటకాలకు రుచిని కూడా ఇస్తుంది. జాపత్రి తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక ఔషధ గుణాలు లభ్యమవుతాయి. జాపత్రిని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి.. జాపత్రి తీసుకోవడం చాలా మంచిది. ఇంకా జాపత్రి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

జాపత్రి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లభిస్తాయి. ఇవి వ్యాధులు, ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తాయి. దీంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికం:

జాపత్రిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల.. పలు వ్యాధులు మిమ్మల్ని ఎటాక్ చేయకుండా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు సహాయ పడుతుంది. ముఖ్యంగా శరీరంలో వచ్చే వాపును తగ్గించే లక్షణాలు ఇందులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ మెరుగు:

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రక్త ప్రసరణ అనేది మెరుగ్గా ఉండాలి. శరీరంలో రక్త ప్రసరణ అనేది సవ్యంగా ఉంటే ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరగడం వల్ల చర్మం కూడా నిగారిస్తూ ఉంటుంది. గుండె పనితీరు బాగా పని చేస్తుంది. శరీర భాగాలు కూడా యాక్టివ్‌గా పనిచేస్తాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

యవ్వనంగా ఉంటారు:

జాపత్రి తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారు. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. చర్మ నిగారింపు కూడా పెరుగుతుంది.

దంతాల ఆరోగ్యం:

జాపత్రి తీసుకోవడం వల్ల దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దంతాల సమస్యలు, త్వరగా ఊడిపోవడం వంటివి జరగదు. అంతే కాకుండా నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. చిగుళ్ల నొప్పులు, పంటి నొప్పులు, నోటిలో మంట రాకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us