AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eat Garlic at Night: రోజు రాత్రి నిద్రకు ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్నారంటే..

వర్షా కాలంలో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగవల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మాత్రలను ఆశ్రయించే బదులు, ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అటువంటి ఆహారాల జాబితాలో వెల్లుల్లి..

Eat Garlic at Night: రోజు రాత్రి నిద్రకు ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్నారంటే..
వెల్లుల్లిని హృదయానికి అనుకూలమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇది మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక హృదయ సంబంధ ప్రమాదాలు తగ్గుతాయి. మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. వెల్లుల్లి జ్ఞాపకశక్తిని పదునుపెడుతుంది. మెదడు క్షీణతను నివారిస్తుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది.
Srilakshmi C
|

Updated on: Jul 17, 2025 | 12:32 PM

Share

వర్షాకాలంలో వివిధ రకాల సీజనల్ వ్యాధులు దాడి చేస్తాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగవల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మాత్రలను ఆశ్రయించే బదులు, ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అటువంటి ఆహారాల జాబితాలో వెల్లుల్లి అగ్రస్థానంలో ఉంటుంది. ఈ సీజన్‌లో దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. దీనిలోని ఔషధ గుణాలు అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాదు ప్రతి రాత్రి రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే వ్యాధులు దగ్గరకు రావు. కాబట్టి వెల్లుల్లి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్లు B6, C, మాంగనీస్, సెలీనియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.
  • ప్రతి రాత్రి రెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
  • రోజూ వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు.
  • వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
  • అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను నమలడం మంచిది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  • వెల్లుల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఎంజైమ్‌ల ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నివారిస్తుంది.
  • బరువు తగ్గాలనుకునే వారు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినాలి. ఇది జీవక్రియను పెంచుతుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. తద్వారా, ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే సెలీనియం మంచి నిద్రకు సహాయపడుతుంది.
  • వెల్లుల్లి రెబ్బలు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
  • వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కాలేయం శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • వెల్లుల్లిలోని పోషకాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..
వేలంలో రూ. 25.20 కోట్లు.. ఇంటికి తీసుకెళ్లేది మాత్రం..
వేలంలో రూ. 25.20 కోట్లు.. ఇంటికి తీసుకెళ్లేది మాత్రం..
పెద్ద జామకాయ Vs చిన్న జామకాయ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
పెద్ద జామకాయ Vs చిన్న జామకాయ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
45 బంతుల్లోనే సెంచరీ.. కట్‌చేస్తే.. బీసీసీఐకి స్ట్రాంగ్ వార్నింగ్
45 బంతుల్లోనే సెంచరీ.. కట్‌చేస్తే.. బీసీసీఐకి స్ట్రాంగ్ వార్నింగ్