- Telugu News Photo Gallery Fungal infection of feet during the rainy season, Get rid of the problem with these tips
వర్షాకాలంలో కాళ్ళకు ఫంగల్ ఇన్ఫెక్షన్.. ఈ టిప్స్‌తో సమస్య దూరం..
వర్షాకాలంలో మీరు నడుస్తున్న సమయంలో ఒక్కోసారి బురద వంటి ప్రదేశాల్లో కాళ్ళు పెట్టాల్సి వస్తుంది. దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ కాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వాటిని శుభ్రంగా, పొడిగా ఉంచడం చాల ముఖ్యం. వర్షం వేళా కాళ్ళుని ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడటానికి ఉపయోగపడే చిట్కాలు గురించి ఈరోజు తెలుసుకుందామా మరి..
Updated on: Jul 18, 2025 | 4:10 PM

కాళ్ళను శుభ్రపరచడం: ప్రత్యేకించి వర్షంలో తడిసిన తర్వాత ప్రతిరోజూ తేలికపాటి సబ్బు, గోరువెచ్చని నీటితో మీ కాళ్ళను కడగాలి. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలు రాకుండా మీ కాళ్ళను కాపాడవచ్చు.

కాళ్ళను ఆరబెట్టడం: మీ కాళ్ళు, పాదాలను, ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య, మృదువైన టవల్ ఉపయోగించి పూర్తిగా ఆరబెట్టండి. ఇలా చేస్తే కళ్ళలో నీరు నిలిచిపోకుండా ఉంటుంది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ ముందుగానే అరికట్టవచ్చు.

మాయిశ్చరైజింగ్: మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి తేలికైన, జిడ్డు లేని మాయిశ్చరైజర్ రాయండి. ముఖ్యంగా మీకు చెమట పట్టే పాదాలు ఉంటే, అదనపు తేమను పీల్చుకోవడానికి యాంటీ ఫంగల్ పౌడర్ వాడండి.

గోళ్ల సంరక్షణ: మీ కాలి గోళ్ల కింద మురికి, చెత్త పేరుకుపోకుండా ఉండటానికి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించండి. ఇలా చెయ్యకపోతే గోళ్లలో మురికి పేరుకుపోయి కాళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలు కారణం అవుతుంది.

చెప్పులు లేకుండా నడవకండి: తడి ప్రాంతాలలో చెప్పులు లేకుండా నడవకండి, ఎందుకంటే ఇది మీ పాదాలకు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఏవైనా కోతలు లేదా గీతలు ఉంటే వెంటనే యాంటీసెప్టిక్, బ్యాండేజ్‌తో సరిచేయండి.




