Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colorful Food Benefits: ఈ రంగు ఉన్న ఆహారాలను తింటే సంతానోత్పత్తి కలుగుతుందట!

రంగులు అనేవి మనిషిని బాగా ప్రభావితం చేస్తాయి. తినే ఆహారంలోనైనా.. ఇంట్లోని వస్తువులైనా.. బట్టలైనా కలర్ ఫుల్‌గా ఉండాల్సిందే. కలర్ ఫుల్‌గా లేకపోతే తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. మనం అనేక రకాలైన ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. ఇలా రంగురంగుల ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూంటారు. ఆహారంలోని అసలు శక్తి వాటి రంగుల్లనే ఉందని అంటున్నారు. ఒక్కో రంగు ఆహారానికి.. ఒక్కో ప్రత్యేకత ఉందని అంటారు. మరి ఎలాంటి రంగు ఆహారం తింటే..

Colorful Food Benefits: ఈ రంగు ఉన్న ఆహారాలను తింటే సంతానోత్పత్తి కలుగుతుందట!
Color Food Benefits
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 31, 2023 | 4:43 PM

రంగులు అనేవి మనిషిని బాగా ప్రభావితం చేస్తాయి. తినే ఆహారంలోనైనా.. ఇంట్లోని వస్తువులైనా.. బట్టలైనా కలర్ ఫుల్‌గా ఉండాల్సిందే. కలర్ ఫుల్‌గా లేకపోతే తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. మనం అనేక రకాలైన ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. ఇలా రంగురంగుల ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూంటారు. ఆహారంలోని అసలు శక్తి వాటి రంగుల్లనే ఉందని అంటున్నారు. ఒక్కో రంగు ఆహారానికి.. ఒక్కో ప్రత్యేకత ఉందని అంటారు. మరి ఎలాంటి రంగు ఆహారం తింటే.. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పుడు చూద్దాం.

ఆరెంజ్ కలర్:

ఆరెంజ్‌ రంగులో ఉండే బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ, నారింజ, బత్తాయి వంటి ఆహార పదార్థాల్లో కర్కుమిన్, బీటా కెరోటీన్, కెరోటినాయిడ్స్, కెరోటిన్ వంటివి ఉంటాయి. ఇవి ఎండోక్రైన్ వ్యవస్థను ఆరోగ్యవంతంగా చేసతుంది. అంతేకాకుండా ఆరెంజ్ కలర్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల సంతానోత్పత్తి కూడా మెరుగు పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిలను పెంచి.. ఎలాంటి వ్యాధులు దరి చేరకుండా చూస్తుంది. అలాగే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

ఎరుపు రంగు:

ఎరుపు రంగులో ఉండే పండ్లు, కాయగూరలు, ఆహార పదార్థాల్లో లైకోపీన్, ఫ్లోరెటిన్, కెరోటినాయిడ్స్, ఫ్లేవోన్స్, ఫైటోకెమికల్స్ వంటివి ఉంటాయి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి హెల్ప్ చేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, శరీరంలో వాపులను తగ్గించడానికి సహాయ పడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడిక్సల్స్‌ నుంచి కణాలను రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

పసుపు రంగు:

పసుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయలు వంటి ఆహార పదార్థాలు తినడం వల్ల జింజెరాల్, ప్రీబయోటిక్ ఫైబర్, లుటిన్, రుటిన్, జియాక్సంతిన్‌లు మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను బల పరచడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేస్తాయి. డయాబెటీస్ ముప్పు ఉన్న వారికి ఈ రంగు ఆహారం మేలు చేస్తుంది.

ఆకుపచ్చ రంగు:

ఆకు పచ్చగా ఉన్న పండ్లు, కాయగూరలు, ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైటో స్టెరాల్, టానిన్, సల్ఫోరాఫేన్, టైరోసోల్, థెఫ్లావిన్ వంటివి ఉంటాయి. ఆకు పచ్చ డైట్‌లో వీటిని చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిలో విటమిన్ కే ఉంటుంది. అంతే కాకుండా రక్త వృద్ధి, ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయ పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు