AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Pressure Control: ఈ పండు తింటే బీపీ సమస్య దూరం.. శరీరానికి మేలు చేసే ఈ పండు ఏంటో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో బీపీ సమస్య అందరినీ వేధిస్తుంది. బీపీ సమస్య నుంచి రక్షణకు లిచి పండును తినాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ పండును తినడం వల్ల బీపీ సమస్య దూరం కావడంతో పాటు శరీరానికి కూడా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.

Blood Pressure Control: ఈ పండు తింటే బీపీ సమస్య దూరం.. శరీరానికి మేలు చేసే ఈ పండు ఏంటో తెలుసా?
Litchi
Follow us
Srinu

|

Updated on: Apr 11, 2023 | 11:00 AM

సాధారణంగా మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా షుగర్, బీపీ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఇవి అదుపులో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు పండ్లు తినాలని అందరూ సూచిస్తారు. అయితే మనకు వచ్చిన సమస్యకు అనుగుణంగా, వాటిని తగ్గించే పండ్లను తింటే మంచిదని వైద్య నిపుణుల సూచన. అయితే ప్రస్తుత రోజుల్లో బీపీ సమస్య అందరినీ వేధిస్తుంది. బీపీ సమస్య నుంచి రక్షణకు లిచి పండును తినాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ పండును తినడం వల్ల బీపీ సమస్య దూరం కావడంతో పాటు శరీరానికి కూడా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. ప్రస్తుత వేసవి కాలంలో లిచి పండు తింటే చాలా మేలని చెబుతున్నారు. లిచి పండు అంటే సోప్‌బెర్రీ కుటుంబానికి చెందిన పండు. ఈ పండులో లోపల తెల్లగా జ్యూసిగా ఉండడంతో పాటు తీపి, పులుపు రుచిని కలిగి ఉంటుంది. ఎక్సోటిక్ లిచీలో అనేక మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. ఈ పండులో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరానికి అనేక ప్రయోజనాలను కలుగజేస్తాయి. లిచి పండులో ఉండే ఉండే ఎపికాటెచిన్, రూటిన్, మొక్కల భాగాలు, ఆక్సీకరణ ఒత్తిడితో పాటు దీర్ఘకాలిక అనారోగ్యాలు, అంధత్వం, మధుమేహం, గుండె జబ్బులు క్యాన్సర్‌ వంటి జబ్బుల నివారణలో సహాయపడతాయి. లిచీలోని రాగి కంటెంట్ జుట్టు అభివృద్ధికి సాయం చేస్తాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. లిచీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిరోధిస్తుంది. లిచీ పండులో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెరుగుదల

లిచిస్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా నీటిలో కరిగే విటమిన్‌గా పని చేస్తుంది. ఇది మన శరీరాన్ని సూక్ష్మజీవుల నుంచి కాపాడుతుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.

గుండె ఆరోగ్యం మెరుగు

లిచి పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఈ పండు నైట్రిక్ ఆక్సైడ్ సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది. వాసోడైలేటర్‌గా ఉండటం వల్ల రక్తనాళాల విస్తరణలో కూడా సహాయం చేస్తుంది. గుండెపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్తపోటు నిర్వహణ

ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి అవసరమైన పొటాషియంతో పాటు సోడియం సమతుల్య నిష్పత్తిని లిచీ పండు కలిగి ఉంటుంది. కాబట్టి లిచీ రక్తపోటును తగ్గించడానికి ఒక గొప్ప మార్గంగా నిపుణులు పేర్కొంటున్నారు. పొటాషియం వాసోడైలేటరీ లక్షణాలు శరీరంలోని రక్త నాళాలను ప్రశాంతంగా ఉంచడంతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తాయి. ఫలితంగా శరీరం ఆరగ్యకరమైన రక్తపోటును నిర్వహిస్తుంది. 

రక్త ప్రసరణను మెరుగు

ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను నిర్వహించడానికి లిచిస్ సాయం చేస్తాయి. ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ సితో పాటు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండెతో పాటు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

జీర్ణక్రియలో సాయం

లిచీస్‌లో నీరు, కార్బోహైడ్రేట్లు, అధిక ఫైబర్ కంటెంట్ తక్కువ క్యాలరీ విలువలు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి అనువైనదిగా నిపుణులు పేర్కొంటారు. అలాగే పేగు కదలికలను నిర్వహించడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అందువల్ల లిచీస్ జీర్ణక్రియలో సాయం చేస్తాయి. అలాగే జీఐ ట్రాక్ట్ సమస్యలకు చికిత్స చేస్తుంది. 

రక్తహీనత నివారణ

రక్తహీనతను నివారించడంలో లిచీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో శరీరానికి అవసరమయ్యే కాపర్ ఉంటుంది. ఇది రక్తంలోని ఎర్రరక్తకణాల పెంచడంలో సాయం చేస్తాయి. 

లిబిడో స్థాయి పెరుగుదల

లిచీస్‌లో పొటాషియం, రాగి, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మనిషి శరీరంలో లైంగిక కోరికలు ప్రేరేపించడంతో పాటు లిబిడో స్థాయిలను పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి