AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Pressure: అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేసి తగ్గించుకోండి..!

ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో అధిక రక్తపోటు ఒకటి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. దీని కారణంగా రక్త ప్రవాహంపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో తలనొప్పి, మైకం, హృదయ సంబంధ వ్యాధులు చుట్టుముట్టి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం..

Blood Pressure: అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేసి తగ్గించుకోండి..!
Blood Pressure
Subhash Goud
|

Updated on: Mar 23, 2023 | 9:00 PM

Share

ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో అధిక రక్తపోటు ఒకటి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. దీని కారణంగా రక్త ప్రవాహంపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో తలనొప్పి, మైకం, హృదయ సంబంధ వ్యాధులు చుట్టుముట్టి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అధిక బీపీ కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధిని తగ్గించడాని మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మన జీవనశైలిలో కొన్ని మార్పుల చేసుకుంటే ఎలాంటి మందులు వాడకుండానే నయం చేసుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం నియమాలు పాటిస్తే ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. అధిక రక్తపోటును ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.

  1. ఉప్పును తక్కువ వాడండి: అనేక అధ్యయనాలలో అధిక అధిక రక్తపోటు సోడియంతో ముడిపడి ఉంది. రోజువారీ దినచర్యలో తక్కువ ఉప్పు తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యను నివారించవచ్చు. సాధారణంగా ప్రజలు ఉప్పును ఎక్కువగా తీసుకోకుండా ఉండటం మంచిది. సాధారణంగా ఒక మనిషి రోజు మొత్తంలో 2300 మిల్లీ గ్రాములకు మించి శరీరంలోకి ఉప్పు చేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అయితే ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు సుమారు 2,800 మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో చెక్కర వ్యాధి వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు తేల్చిచెప్పారు అంతేకాదు డయాబెటిస్‌ ద్వారా బీపీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని, ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందంటున్నారు నిపుణులు.
  2. రోజూ వ్యాయమం తప్పనిసరి: ప్రతి వ్యక్తికి వ్యాయమం ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయమం చేయడం చాలా ముఖ్యమని పరిశోధనలో తేలింది. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇది ఎంతో ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి 40 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
  3. ధూమపానం మానేయండి: ధూమపానం, మద్యపానం అధిక రక్తపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. మద్యం తాగడం వల్ల 16 శాతం అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయని పరిశోధనలలో తేలింది. ధూమపానం, మద్యపానం వల్ల రక్తనాళాలు పూర్తిగా దెబ్బ తింటాయని, ఈ రెండు మీ ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదంటున్నారు. అలాగే పిండి పదార్థాలు షుగర్‌, రక్తపోటు సమస్యను పెంచుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ రెండు విషయాలను తగ్గించడం వల్ల రక్తపోటు నుంచి కాపాడుకోవచ్చు.
  4. ఒత్తిడిని తగ్గించుకోండి: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో, మానసిక ఆందోళన, వివిధ రకాల పనులలో ఒత్తిడిలను తగ్గించుకోవాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. బీపీ ఉన్నవారు ఒత్తిడి కారణంగా మరిన్ని వ్యాధులు తెచ్చుకునే అవకాశం ఉంది. అధిక బీపీ ఉన్న వారు ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. పోటాషియం తీసుకోవడం పెంచండి: హైబీపీతో బాధపడుతున్నవారు పోటాషియం అనేది ఒక ముఖ్యమైన పోషకం. ఆహారంలో పోటాషియం ఉన్న వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ప్రాసెస్‌ చేయబడిన, ప్యాక్‌ చేయబడిన ఆహారాలలో అత్యధికంగా సోడియం ఉంటుంది. ఆహారాన్ని సమతుల్యం చేయడానికి పోటాషియం ఉన్న వాటిని తీసుకోవడం మంచిది. అవి ఆకు కూరలు, టమోటాలు, బంగాళ దుంపలు, చిలగడ పండ్లు, అరటి, అవకాడో, నారిజం, నట్స్‌, పాలు, పెరుగు వంటివి.

Follow Us
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే