Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep: అర్థరాత్రి ఉన్నట్లుండి మెలకువా వస్తోందా.? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..

ప్రశాంతమైన నిద్రకు దూరం కావడం వల్ల చాలా మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరిపడ నిద్రలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో శారీరక ఆరోగ్యంపైన కూడా దుష్ప్రభావం పడుతోంది. ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వినియోగం కూడా పెరగడంతో నిద్రపై ప్రభావం పడుతుంది...

Sleep: అర్థరాత్రి ఉన్నట్లుండి మెలకువా వస్తోందా.? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..
Sleep
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 14, 2023 | 10:04 PM

ఒక 50 ఏళ్ల క్రితం అసలు నిద్రలేమి అనే ఒక సమస్య ఉంటుందనే విషయం కూడా తెలియకపోవచ్చు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు రావడం, షిఫ్ట్‌లతో కూడిన వర్క్‌ కల్చర్‌ కారణంగా ఏదైనా.. నిత్రలేమితో సతమతమవుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

ప్రశాంతమైన నిద్రకు దూరం కావడం వల్ల చాలా మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరిపడ నిద్రలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో శారీరక ఆరోగ్యంపైన కూడా దుష్ప్రభావం పడుతోంది. ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వినియోగం కూడా పెరగడంతో నిద్రపై ప్రభావం పడుతుంది.

ఇక హాయిగా నిద్రపోతున్న సమయంలో ఉన్నపలంగా మెలకువా వచ్చే సందర్భాలు కూడా మనలో చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా రాత్రుళ్లు నిద్రలో నాణ్యత తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు ఉన్నపలంగా మెలకువ వస్తే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా రాత్రుళ్లు మెలకువ రాగానే ఎవరైనా చేసే పని సమయం ఎంతో తెలుసుకోవడం. అయితే ఎట్టి పరిస్థితుల్లో సమయం చూడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై ల్యూమస్‌ టెక్‌ సీఈఓ డాక్టర్ బిక్వాన్‌ లువో మాట్లాడుతూ.. రాత్రి నిద్రలేచిన సమయంలో సమయాన్ని చూస్తే ఒత్తిడి పెరుగుతందని, నిద్రపోవడం కష్టమవుతుందని తెలిపారు. ఒకవేళ సమయాన్ని స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తే.. తెలియకుండానే కంటెంట్‌ను సెర్చ్‌ చేస్తాం. ఇలా చేయడం వల్ల మళ్లీ నిద్ర పట్టదు.

స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి వెలువడే బ్లూ లైట్‌ కారణంగా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అర్థరాత్రి మెలకువ వస్తే, వెంటనే మంచంపై నుంచి లేవకూడదని, విశ్రాంతి తీసుకోవాలని, మళ్లీ నిద్రకు ఉపక్రమించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎంతసేపు ప్రయత్నించినా నిద్రరాకపోతే.. కాసేపు పుస్తకం చదవడం లేదా ప్రశాంతతను కలిగించే యోగాను చేయాలని చెబుతున్నారు. ఇక రాత్రుళ్లు నిద్రకు భంగం కలగకుండా ఉండాలంటే పడుకునే ముందు స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..