Yoga for Urine Control: మూత్రాన్ని ఆపుకోలేక పోతున్నారా.. ఈ ఆసనాలతో చెక్!

ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు కుదరక చాలా మంది మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. కానీ ఇది అందరికీ సాధ్య పడదు. చాలా మందికి మూత్రాన్ని కంట్రోల్ చేయలేరు. దీంతో బయటకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. బాత్రూమ్‌లోకి వెళ్లేంతలోనే టాయిలెట్ వేసేసుకోవడం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు నియంత్రణ లేకుండా మూత్రం పోసేయడం, తరచుగా బాత్రూమ్‌కి వెళ్లడం, టాయిలెట్ వచ్చినప్పుడు బాత్రూమ్‌కి వెళ్లేలోపు వచ్చేయడం

Yoga for Urine Control: మూత్రాన్ని ఆపుకోలేక పోతున్నారా.. ఈ ఆసనాలతో చెక్!
Yoga For Urine Control
Follow us
Chinni Enni

|

Updated on: Sep 30, 2024 | 2:40 PM

ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు కుదరక చాలా మంది మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. కానీ ఇది అందరికీ సాధ్య పడదు. చాలా మందికి మూత్రాన్ని కంట్రోల్ చేయలేరు. దీంతో బయటకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. బాత్రూమ్‌లోకి వెళ్లేంతలోనే టాయిలెట్ వేసేసుకోవడం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు నియంత్రణ లేకుండా మూత్రం పోసేయడం, తరచుగా బాత్రూమ్‌కి వెళ్లడం, టాయిలెట్ వచ్చినప్పుడు బాత్రూమ్‌కి వెళ్లేలోపు వచ్చేయడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువగా బాగా ముసలి వారిలో చూస్తాం. కానీ వయసున్న వారిలో కూడా అలవాటు ఉంటే మాత్రం కాస్త కష్టమే అని చెప్పువచ్చు. ఈ లక్షణం ప్రసవం తర్వాత మహిళల్లో కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పే కొన్ని యోగాసనాలతో ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చు. మరి ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చక్రాసనం:

చక్రాసనం వేయడం ద్వారా మూత్రాన్ని కంట్రోల్ చేయలేక పోవడం అనే సమస్యలను తగ్గించుకోవచ్చు. చక్రాసనాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆసనం వేయడం ద్వారా కంటి ప్రాత కండరాలు అనేవి బలంగా మారతాయి. మూత్రం మీద నియంత్రణ పెరుగుతుంది.

భద్రాసనం లేదా బటర్ ఫ్లై పోజ్:

బటర్ ఫ్లై పోజ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఆసనాన్ని గర్భిణీ స్త్రీలు వేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈ ఆసనం చాలా బెస్ట్. ఈ ఆసనంతో కటి ప్రాంతం వద్ద కండరాలు బలపడతాయి. మూత్రాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఆసనం వేయడం చాలా సింపుల్. ఆ ఆసనం వేయడం వల్ల అధిక బరువు, ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది మహిళలకు బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

కోణాసనం:

అదే విధంగా కోణాసనం వేయడం వల్ల కూడా మూత్రం మీద నియంత్రణ అనేది ఏర్పడుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల నడుము, వెన్న, కంటి ప్రాంతం భాగాలు బలంగా ఉంటాయి. దీంతో మూత్రాశయంపై నియంత్రణ వస్తుంది.

పశ్చిమోత్తాసనం:

పశ్చిమోత్తాసనం వేయడం వల్ల నడుము, కటి ప్రాంతం, తొడ కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో మూత్రాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. అంతే కాకుండా ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే