AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouth Ulcers: నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం

నోటి పూత అనేది ఒక సాధారణ సమస్య. అందుకే చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ తరచుగా నోట్లో పుండ్లు, గాయాలు కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఓ తీవ్రమైన అనారోగ్య సమస్యకు ముందస్తు సంకేతంగా సూచిస్తుంది. కాబట్టి వీటి గురించి అజాగ్రత్తగా ఉండటం మంచిది. వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు తీసుకోవాలి..

Mouth Ulcers: నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం
Mouth Ulcers
Srilakshmi C
|

Updated on: Feb 13, 2025 | 9:14 PM

Share

నోటి పూతల అనేది ఒక సాధారణ సమస్య. చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. సాధారణంగా నోటి లోపల, నాలుకపై లేదా బుగ్గలు, పెదవులు లేదా గొంతు లోపలి భాగంలో ఇవి సంభవిస్తాయి. ఈ గాయాలు, కొన్నిసార్లు చాలా బాధాకరంగా ఉంటాయి. తినడానికి, త్రాగడానికి, మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటాయి. ఈ గాయాలు కొన్ని రోజుల్లోనే వాటంతట అవే నయం అవుతాయి. కానీ ఇలా పదే పదే జరిగితే లేదా ఎక్కువ కాలం నయం కాకపోతే విస్మరించడం ప్రమాదకరం. ఈ గాయాలు శరీరంలోని కొన్ని తీవ్రమైన సమస్యలకు సంకేతం. పదే పదే వచ్చే నోటి పూతల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

పోషకాహార లోపం

నోటి పూతలే పదే పదే రావడానికి ప్రధాన కారణం శరీరంలో పోషకాలు లేకపోవడం. విటమిన్ బి12, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం నోటి పూతల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే, అది నోటి పూతలకు దారితీస్తుంది.

జీర్ణ సమస్యలు

నోటి పూతలకు మరొక కారణం జీర్ణవ్యవస్థలోని సమస్యలు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యలు శరీరంలో టాక్సిన్స్ స్థాయిలను పెంచుతాయి. ఇది నోటి పూతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం, కడుపు వ్యాధులు, శరీరంలో పిత్తం పెరగడం నోటి పూతలకు కారణమవుతాయి. మీకు జీర్ణ సమస్యలు, తరచుగా నోటి పూతలు వస్తుంటే శరీర అంతర్గత సమతుల్యతలో అంతరాయం కలిగిందనడానికి ఇదొక సూచన.

ఇవి కూడా చదవండి

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

నోటి పూతలకు మరొక ప్రధాన కారణం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ. శరీర రోగనిరోధక శక్తి బలహీనపడినప్పుడు శరీర ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడలేకపోతుంది. ఇది నోటిలో బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల సంభావ్యతను పెంచుతుంది. ఇది అల్సర్లకు దారితీస్తుంది.

ఒత్తిడి, ఆందోళన

ఒత్తిడి, ఆందోళన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి కూడా నోటి పూతలకు ప్రధాన కారణం కావచ్చు. మనం ఒత్తిడికి గురైనప్పుడు, శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇంకా, ఒత్తిడి శరీరంలో మంటను పెంచుతుంది. ఇది నోటి పూతలకు దారితీస్తుంది.

అంటు వ్యాధి

నోటి పూతల పునరావృతానికి తీవ్రమైన కారణం ఇన్ఫెక్షన్. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ లేదా కాండిడా ఇన్ఫెక్షన్ వంటి కొన్ని వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నోటి పూతలకు కారణమవుతాయి. మీకు తరచుగాబరువు తగ్గుతుంటే, జ్వరం లేదా గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఇది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!