Lifestyle: రాత్రుళ్లు లో దుస్తులు లేకుండా పడుకుంటే ఏమవుతుందో తెలుసా.?

రాత్రుళ్లు లో దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు మొదలు, మానసిక సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని అంటున్నారు. రాత్రుళ్లు లో దుస్తులు ధరించకుండా పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: రాత్రుళ్లు లో దుస్తులు లేకుండా పడుకుంటే ఏమవుతుందో తెలుసా.?
Sleep
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 19, 2024 | 12:04 PM

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు నిద్రలేమి కారణంగా నిపుణులు చెబుతుంటారు. అయితే పడుకునే సమయంలో మనం చేసే కొన్ని తప్పులు సైతం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. సాధారణంగా రాత్రి పడుకునే సమయంలో ప్రత్యేక దుస్తులను ధరించడం చాలా మంది చేసే పనే.

అయితే కొందరు రోజంతా వేసుకునే దుస్తులనే రాత్రి కూడా వేసుకుంటారు. ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బిగుతుగా ఉండే జీన్స్‌లను ధరించి పడుకుంటే పలు రకాల సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. అదే విధంగా లో దుస్తుల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. రాత్రుళ్లు నిద్రపోయే సమయంలో లో దుస్తులను ధరించడం వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటయాని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా రాత్రుళ్లు మహిళలు బ్రా ధరించి పడుకోవడం మంచిది కాదనేది నిపుణుల మాట. బిగుతుగా ఉండే బ్రాలను ధరించిపడుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఇది హైపర్ పిగ్మెంటేషన్‌కు దారి తీసే అవకాశాలు ఉంటాయి. మెలనిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే వీలైనంత వరకు వదులుగా ఉండే ఇన్నర్‌ వియర్స్‌ ఉపయోగించాలి లేదంటే లేకుండా నిద్రపోవడం మంచిదని అంటున్నారు.

ఇక పురుషులు కూడా బిగుతుగా ఉండే అండర్‌ వెయిర్‌ ధరించడం వల్ల పలు సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధిక వేడి కారణంగా వీర్య కణాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే చమట కారణంగా అలర్జీలు వంటి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే లో దుస్తులు లేకుండా నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇలా పడుకోవడం వల్ల చర్మం సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలు సైతం దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. లో దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల శరీరంలో కార్టిసోల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇక నిద్రలేమి సమస్యను కూడా దూరం చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..