ఇప్పటి యువతికి లేవగానే బెడ్ కాఫీ అని, టీ అని తాగుతుంటారు.. చాలా మంది టీ కంటే కాఫీనే ఇష్టపడుతుంటారు..
రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అయితే సరైన పద్ధతిలో కాఫీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయట.
పాలు చెక్కెర ఉపయోగించి కాఫీ తాగే బదులు.. బ్లాక్ కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిందని నిపుణులు చెప్తున్నారు.
బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు క్రమంగా తగ్గిపోతుందట. అంతే కాకుండా స్ట్రోక్ వంటి గుండె సంబంధ సమస్యలు తగ్గిస్తుంది.
రోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. అయితే అది కూడా మితంగా మాత్రమే తీసుకోవాలి.
ఒత్తిడికి గురైనప్పుడు లేదా టెన్షన్‌గా ఉన్నప్పుడు ఒక కప్పు బ్లాక్ కాఫీని తీసుకుంటే మానసిక స్థితి మెరుగుపరిచి మనిషి ఉత్తేజంగా ఉంచేలా చేస్తుంది.
ప్రతి రోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచి కాలేయ క్యాన్సర్, హెపటైటిస్, ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ సిర్రోసిస్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
ప్రతి రోజు చెక్కెర లేకుండ బ్లాక్ కాఫీ తాగడం వల్ల పొట్టని శుభ్రం చేస్తుంది.. మూత్రం ద్వారా టాక్సిన్స్, బ్యాక్టీరియాను సులభంగా బయటకి పంపిస్తుంది.