AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sperm Count: మగవారికి స్పెర్మ్‌ కౌంట్ ఎంత ఉండాలి.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే

ప్రస్తుతం మగవారిలో కూడా సంతానలేమి సమస్యలు ఎక్కువవుతున్నాయి. మారిన జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణం ఏదైనా చాలా మంది పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గుతోంది. దీంతో సంతానలేమి సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్‌ గణనీయంగా...

Sperm Count: మగవారికి స్పెర్మ్‌ కౌంట్ ఎంత ఉండాలి.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే
Sperm Count
Narender Vaitla
|

Updated on: Aug 22, 2024 | 9:56 AM

Share

ప్రస్తుతం మగవారిలో కూడా సంతానలేమి సమస్యలు ఎక్కువవుతున్నాయి. మారిన జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణం ఏదైనా చాలా మంది పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గుతోంది. దీంతో సంతానలేమి సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్‌ గణనీయంగా తగ్గుతున్నట్లు గణంకాలు చెబుతున్నారు. ‘హ్యూమన్ రిప్రొడక్షన్ అప్‌డేట్’ జర్నల్ నివేదిక ప్రకారం 1973 నుంచి స్పెర్మ్ కౌంట్ నిరంతరం క్షీణిస్తోంది. దీంతో సంతానలేమి సమస్య సర్వసాధారణమైపోతోంది. శాస్త్రవేత్తల ప్రకారం, రాబోయే కాలంలో పురుషుల స్పెర్మ్ కౌంట్ వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు.

ఇంతకీ ఒక పురుషుడికి స్పెర్మ్‌ కౌంట్ ఎంత ఉండాలన్న సందేహం రావడం సాధారణం. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. ఒక ml వీర్యంలో 1.5 కోట్ల శుక్ర కణాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఖ్య తగ్గితే గర్భం దాల్చడంలో ఇబ్బంది ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్త్రీ గర్భధారణకు పురుషుల స్పెర్మ్‌ కదలికలకు అవసరమని నిపుణులు చెబుతున్నారు. 40 శాతం శుక్ర కణాలు అండాన్ని చేరుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 35 ఏళ్ల తర్వాత వీర్యం నాణ్యత క్షీణించడం ప్రారంభమవుతుందని అంటున్నారు.

స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి కారణాలు ఏంటి..

స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి కాలుష్యం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ చేసే వారిలో, మద్యం సేవించే వారిలో స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే ఊబకాయం కూడా స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. వీటితో పాటు పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అసమతుల్యత కారణంగా స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. స్పెర్మ్‌కు సంబంధించిన జన్యుపరమైన వ్యాధులు, ప్రైవేట్ భాగాలలో ఇన్‌ఫెక్షన్, పలు రకాల లైంగిక వ్యాధుల కారణంగా కూడా శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.

స్పెర్మ్‌ క్వాలిటీ పెంచుకోవాలంటే..

శుక్రకణాల నాణ్యతతో పాటు కౌంట్ పెరగాలంటే ఆల్కహాల్‌, స్మోకింగ్ పూర్తిగా మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా వేడి ఉండే ప్రదేశాల్లో ఉండకూడదు. అలాగే బిగుతుతా ఉండే దుస్తులను ధరించకూడదు. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని ఉపయోగించకూడదు. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా వేడి నీటితో స్నానం చేయకూడదు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..