AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin E Capsule: జుట్టు బాగా పెరిగేందుకు ‘విటమిన్ ఈ’ క్యాప్సూల్స్ ఎలా వాడాలంటే..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టుతో అందం అనేది మరింత రెట్టింపు అవుతుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వల్ల మీరు మరింత అందంగా కనిపిస్తారు. చాలా మందికి జుట్టు అంటే చాలా ఇష్టం. ఇంత ప్రేమించే జుట్టు రాలిపోతూ ఉంటే ఎవరికైనా సరే బాధగా అనిపిస్తుంది. జుట్టు అనేది మగవారికైనా, ఆడవారికైనా చాలా ముఖ్యం. జుట్టు రాలడానికి చాలా కారణాలు..

Vitamin E Capsule: జుట్టు బాగా పెరిగేందుకు 'విటమిన్ ఈ' క్యాప్సూల్స్ ఎలా వాడాలంటే..
Vitamin E Capsules
Chinni Enni
|

Updated on: Jun 22, 2024 | 2:13 PM

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టుతో అందం అనేది మరింత రెట్టింపు అవుతుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వల్ల మీరు మరింత అందంగా కనిపిస్తారు. చాలా మందికి జుట్టు అంటే చాలా ఇష్టం. ఇంత ప్రేమించే జుట్టు రాలిపోతూ ఉంటే ఎవరికైనా సరే బాధగా అనిపిస్తుంది. జుట్టు అనేది మగవారికైనా, ఆడవారికైనా చాలా ముఖ్యం. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటని చెప్పలేం. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ ఇలా అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టుకు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని అప్లై చేస్తున్నారు. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నారు. మరి విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎంత వరకు జుట్టు సమస్యలను తగ్గించి.. ఆరోగ్యంగా ఉంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు – విటమిన్ ఈ క్యాప్సూల్స్:

పెరుగు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుందన్న విషయం తెలిసిందే. ఒక గిన్నె తీసుకుని.. మీ జుట్టు పొడవును బట్టి పెరుగు, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒకటి వేయండి. పొడుగ్గా ఉంటే రెండు వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. తలకు బాగా పట్టించండి. ఓ అరగంట తర్వాతా షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు పెట్టినా.. మీ జుట్టు బలంగా, సాఫ్ట్‌గా తయారవుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.

గుడ్డు – విటమిన్ ఈ క్యాప్సూల్స్:

ఒక గిన్నెలోకి గుడ్డు తెల్ల సొన, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఈ రెండూ కలపండి. దీన్ని జుట్టుకు బాగా పట్టించండి. ఓ పావు గంట సేపు తర్వాత షాంపూతో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల జుట్టు సాఫ్ట్‌గా, బలంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె – విటమిన్ ఈ క్యాప్సూల్స్:

ముందుగా ఒక గిన్నెలోకి కొబ్బరి నూనె తీసుకోండి. దీన్ని డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయండి. ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలిపి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడే తలకు పట్టించి.. తలపై మర్దనా చేయండి. ఇలా చేయడం వల్ల తలపై రక్త ప్రసరణ జరుగుతుంది. అంతే కాకుండా జుట్టు మృదువుగా, బలంగా తయారవుతుంది. జుట్టు సమస్యలు తగ్గి.. పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!