AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Combinations: ఈ పండ్లు, కూరగాయలు కలిపి తిన్నారో.. నేరుగా యమలోకానికి టికెట్‌ కన్ఫార్మ్‌ అయిపోద్ది! జర భద్రం

సాధారణంగా, అన్ని సీజన్లలో పండ్లు, కూరగాయలను ఎటువంటి భయం లేకుండా ఆస్వాదించవచ్చు. అవి శరీరానికి మంచి పోషకాలను అందించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ ఒకే రకమైన పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం, తప్పు కలయికలో తినడం వల్ల అజీర్ణం, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి..

Food Combinations: ఈ పండ్లు, కూరగాయలు కలిపి తిన్నారో.. నేరుగా యమలోకానికి టికెట్‌ కన్ఫార్మ్‌ అయిపోద్ది! జర భద్రం
Food Combinations
Srilakshmi C
|

Updated on: Feb 13, 2025 | 8:39 PM

Share

పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా.. కొన్ని పండ్లు, కూరగాయలను కలిపి అస్సలు తినకూడదు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, కొన్ని ఆహారాలను కలిపి తింటే విషపూరితం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొన్ని పండ్లు, కూరగాయల కలయిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిని కలిపి తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఏ పండ్లు, కూరగాయల కలయికలు మంచివికావో ఇక్కడ తెలుసుకుందాం..

జామ, అరటిపండ్లు అస్సలొద్దు

ఈ రెండు పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి ప్రత్యేక పోషకాహారాన్ని కూడా అందిస్తారు. కానీ వాటిని కలిపి తినకూడదు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, వికారం, ఉబ్బరం, గ్యాస్, నిరంతర తలనొప్పి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నారింజ – క్యారెట్

క్యారెట్లు, నారింజ పండ్ల కలయిక ఆరోగ్యానికి మంచిది కాదు. నారింజ, క్యారెట్లలో లభించే పోషకాలు సాధారణంగా ఒకే విధంగా ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, మూత్రపిండాల సమస్యలు, కడుపులో చికాకు, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ కలయిక ఎప్పుడూ మంచిది కాదని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బొప్పాయి – నిమ్మకాయ

బొప్పాయి, నిమ్మకాయ కూడా అద్భుతమైన పోషకాలను కలిగి ఉన్న రెండు ఆహారాలు. కొంతమంది బొప్పాయిని నిమ్మరసంతో కలిపి తింటారు. దాని రుచి ప్రత్యేకంగా అనిపించవచ్చు. కానీ దాని కలయిక రక్తహీనత, హిమోగ్లోబిన్ అసమతుల్యతకు దారితీస్తుంది. అటువంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి, ఈ కలయిక ఉన్న ఆహారాన్ని పొరపాటున కూడా తీసుకోకూడదు.

అరటి – బొప్పాయి

విభిన్న స్వభావం కలిగిన ఈ రెండు పండ్లను కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు అంటున్నారు. దీనివల్ల వాంతులు, అలెర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అరటిపండ్లు, బొప్పాయి కలిపి తినడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి, ఈ రెండు పండ్లు తినడం మంచిది కాదు. ఈ తప్పు ఎప్పుడూ చేయకండి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.