Snake: వామ్మో.. ఈ పాము సైలెంట్ కిల్లర్.. కాటు వేసినా తెలీదు.. కానీ కొద్దిసేపటికే..
విషపూరితమైన పాము కాటుకు గురైతే బతకడం కష్టం. కింగ్ కోబ్రా కంటే డేంజరస్ పాము గురించి మీకు తెలుసా..? ఎందుకంటే ఇది కాటు వేసినట్లు కూడా తెలియదు. కానీ నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. అందుకే ఈ పామును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు..

క్రైట్ పామును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే, ఇది రాత్రిపూట నిశ్శబ్దంగా నిద్రిస్తున్నవారిపై దాడి చేసి కాటు వేస్తుంది. కింగ్ కోబ్రా కంటే ప్రమాదకరమైన ఈ పాము కాటు వేసిన 90 నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఈ పాము కాటు వల్ల ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మహిళలు మరణించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లోని పాలికల్, ఫల్వారియా గ్రామస్థులను భయాందోళనకు గురిచేసింది. ఈ పాము గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
క్రైట్ పాము ప్రత్యేక లక్షణాలు..
నిశ్శబ్ద దాడి: ఈ పాము రాత్రిపూట తిరుగుతూ నిద్రపోతున్న వారిని కాటు వేస్తుంది. దీని కాటుకు నొప్పి ఉండదు. గాయం కూడా కనిపించదు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు.
విష ప్రభావం: క్రైట్ పాము విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కాటు వేసిన తర్వాత కడుపు నొప్పి, వాంతులు, కండరాల తిమ్మిర్లు, పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స అందించకపోతే 90 నిమిషాల్లో ప్రాణాపాయం సంభవించవచ్చు.
జీవనశైలి: ఇది చల్లని రక్తాన్ని కలిగి ఉన్నందున.. వెచ్చదనం కోసం రాత్రిపూట ఇళ్లలోకి ప్రవేశించి నిద్రపోతున్న వారి చుట్టూ చేరుతుంది. ఈ సమయంలోనే అది కాటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి?
బయట నిద్రించవద్దు: వేసవి, వర్షాకాలంలో వీలైనంత వరకు ఇంటి బయట, బహిరంగ ప్రదేశాల్లో నిద్రించవద్దు.
దోమతెరలు వాడండి: తప్పనిసరిగా బయట నిద్రించాల్సి వస్తే దోమతెరలు వాడటం మంచిది. ఇది పాములు లోపలికి రాకుండా నిరోధిస్తుంది.
లక్షణాలు గమనించండి: ఒకవేళ క్రైట్ పాము కాటు వేస్తే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. నొప్పి లేకపోయినా, పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు.
భారతదేశంలో 345 రకాల పాములు ఉండగా, వాటిలో క్రైట్ అత్యంత విషపూరితమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాము వేసవి, వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




