AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024: దీపావళి రోజున పటాకుల నిప్పురవ్వలు మీ కళ్లలో పడితే ఏమి చేయాలి? ఏమి చేయకూడదంటే

దీపావళి పండగ రోజున బాణాసంచా కాల్చేటప్పుడు కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పటాకుల నుండి వెలువడే పొగ మీ ఊపిరితిత్తులకు మరియు కళ్లకు చాలా హానికరం. పటాకులు కాల్చేటప్పుడు పొరపాటున పటాకుల నిప్పురవ్వలు కంటిలో పడితే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ రోజు తెలుసుకుందాం..

Diwali 2024: దీపావళి రోజున పటాకుల నిప్పురవ్వలు మీ కళ్లలో పడితే ఏమి చేయాలి? ఏమి చేయకూడదంటే
Diwali CrackersImage Credit source: gettyimages.
Surya Kala
|

Updated on: Oct 21, 2024 | 5:37 PM

Share

దీపావళి పండగ అంటే దీపాల వెలుగులు.. పటాకులు సందడి.. ఇవి లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణం. అయితే పటాకులు కాల్చి సంబరాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బనా సంచా కాల్చే సమయంలో సంతోషంగా గడుపుతూ ఏ చిన్న పొరపాటు చేసినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పటాకులు కాల్చేటప్పుడు కళ్లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పటాకుల నుండి వెలువడే పొగ ఊపిరితిత్తులకు మాత్రమే కాదు కళ్లకు చాలా హానికరం. పటాకులు కాల్చే సమయంలో పొరపాటున పటాకుల నెరుసులు కంటిలో పడితే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ రోజు తెలుసుకుందాం..

ఏమి చేయాలి.. ఏమి చేయకూడదంటే?

పటాకులు కాల్చేటప్పుడు నిప్పురవ్వలు వంటివి కళ్లలో పడితే.. పొరపాటున కూడా కళ్ళను రుద్ద వద్దు. ఈ చిన్న తప్పు, అజాగ్రత్త కంటి చూపు పోగొట్టుకునేలా చేస్తుంది. దీపావళి రోజున పటాకులు కాలుస్తుంటే కాల్చిన తర్వాత మీ చేతులను, పిల్లల చేతులను శుభ్రంగా కడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే బాణసంచా తయారీలో అనేక రకాల రసాయన పదార్ధాలను ఉపయోగిస్తారు. కనుక పటాకులను కాల్చిన చేతులతో కళ్లను పోరాటున అయినా తకవద్దు.. ఇలా తాకడం వల్ల చికాకు, దురద, ఎర్రగా మారడం వంటి ఇబ్బందులు కలగవచ్చు. కనుక పటాకుల కాల్చే సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.

ఇవి కూడా చదవండి

క్రాకర్స్ కాల్చే సమయంలో ఏదైనా కంటి సమస్య ఉంటే.. ఇంటి చికిత్సను నివారించండి. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి. అంతేకాని సొంతంగా కంటి చుక్కలను వేసుకోవద్దు. పొరపాటున కూడా ఇంటి చిట్కాలను ప్రయత్నించవద్దు. కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. కనుక దృష్టిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంటిలో నిప్పురవ్వ పడితే ముందుగా చల్లని నీటితో కళ్లను కడగాలి. అనంతరం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి అని నిపుణుడు డాక్టర్ దీపక్ కుమార్ హెచ్చరిస్తున్నారు.

బాణాసంచా కాల్చేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలంటే

పటాకులు కాల్చేటట్లయితే కంటి అద్దాలు ధరించండి. ఇలా చేయడం వలన కళ్ళు బాణాసంచా కాల్చడం వలన వెలువడిన పొగ, వాటి నుండి వచ్చే నిప్పురవ్వల నుంచి కళ్ళకు రక్షణ లభిస్తుంది. అంతేకాదు బాణాసంచా కాల్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చేతుల్లో పేలు పటాకులు కాల్చవద్దు. పిల్లలను కూడా ఒంటరిగా బాణాసంచా కాల్చనివ్వవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..