AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corpse in Dream : కలలో శవం కనిపించిందా..! అయితే దాని అర్థం ఏంటో తెలుసుకోండి..

Corpse in Dream : సప్న శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మనం చూసే కలలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలను సూచిస్తాయి.

Corpse in Dream : కలలో శవం కనిపించిందా..! అయితే దాని అర్థం ఏంటో తెలుసుకోండి..
Corpse In Dream
uppula Raju
|

Updated on: Jun 14, 2021 | 12:33 PM

Share

Corpse in Dream : సప్న శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మనం చూసే కలలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలను సూచిస్తాయి. కొన్ని కలలు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి. సాధారణంగా మనం భయం కలిగించే కలలను మాత్రమే గుర్తుంచుకుంటాం. నిజం ఏమిటంటే మనలో చాలా మంది కలలను చూసిన వెంటనే మరచిపోతారు. అయితే ఈ కలలు భవిష్యత్తులో మనకు ఏమి సూచిస్తాయో తెలుసుకుందాం.

కలలో శవం కనిపిస్తే ఏం జరుగుతుంది.. నిద్రపోతున్నప్పుడు కలలో శవాన్ని చూసినప్పుడు చాలా మంది భయపడతారు. ప్రజలు కలలో శవం కనిపిస్తే చెడు జరుగుతుందని భావిస్తారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో శవం కనిపిస్తే శుభ సూచికంగా చెబుతారు. ఒక వ్యక్తి కలలో శవాన్ని చూస్తే అది అతనికి మంచి సంకేతం. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కలలో శవాన్ని చూస్తే ఆ వ్యక్తి త్వరలోనే వ్యాధి నుంచి విముక్తి పొందుతాడని అర్థం.

కలలో అర్థాన్ని చూసే వ్యాపారికి లాభాలు.. ఒక వ్యాపారవేత్త నిద్రపోయేటప్పుడు తన కలలో ఒక శవాన్ని చూస్తే అది వ్యాపారంలో చాలా లాభం పొందబోతున్నట్లు అర్థం. కలలో శవాన్ని చూడటం ప్రతి కోణం నుంచి శుభమని చెప్పవచ్చు. మీ కలలో మీరు ఎప్పుడైనా శవాన్ని చూసినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. బదులుగా ఈ కల మీకు చాలా పవిత్రమైనది త్వరలో మీరు అనేక సమస్యలను అధిగమించబోతున్నారని అర్థం.

అనాథ అని చెప్పి నమ్మకంగా నటిస్తుంది.. అందినకాడికి దోచుకుంటుంది..! వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్లికూతురు ఎవ్వారం..

Car Loans: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే..

ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనా మృతిపై దర్యాప్తు ప్రారంభం …..రెండు వారాల ఇన్వెస్టిగేషన్

Sushant Singh Rajput Death Anniversary: సుశాంత్ మొదటి వర్ధంతి: అద్భుత హీరో రేర్, అన్‌సీన్ ఫోటోలపై ఓ లుక్కేయండి