అనాథ అని చెప్పి నమ్మకంగా నటిస్తుంది.. అందినకాడికి దోచుకుంటుంది..! వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్లికూతురు ఎవ్వారం..

Woman Cheats Young Men : తాను అనాథనని, తనకు ఎవ్వరూ లేరని, ఒంటరిదానినని యువకులకు వల వేస్తుంది. ప్రేమిస్తున్నానని

అనాథ అని చెప్పి నమ్మకంగా నటిస్తుంది.. అందినకాడికి దోచుకుంటుంది..! వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్లికూతురు ఎవ్వారం..
Woman Cheats
Follow us
uppula Raju

|

Updated on: Jun 14, 2021 | 11:12 AM

Woman Cheats Young Men : తాను అనాథనని, తనకు ఎవ్వరూ లేరని, ఒంటరిదానినని యువకులకు వల వేస్తుంది. ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మకంగా నటిస్తుంది. పెళ్లిచేసుకున్నాక అందినకాడికి దోచుకొని ఊడాయిస్తుంది. తిరుపతిలో వెలుగు చూసిన నిత్య పెళ్లికూతురు లీలలివి. ఈమె బారిన పడిన వ్యక్తులు ఒక్కరొక్కరుగా పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా ఆమె రెండో భర్త మీడియా ఎదుట పలు విషయాలను వెల్లడించాడు. తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వినయ్‌కు 2018లో సుహాసిని పరిచయమైంది. తాను అనాథనని, ప్రేమించానని చెప్పడంతో 2019లో ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయినట్లు వాపోయాడు.

పెళ్లి చేసుకొన్న కొన్ని రోజులకే ఆమె ప్రవర్తన సరిగా లేకపోగా.. తనకు తెలియకుండా తన బంధువుల నుంచి డబ్బులు తీసుకోవడాన్ని గమనించానని తెలిపాడు. మొదటి భర్త వెంకటేశ్వర్లు, ఆమె ఇద్దరు పిల్లలను ఇంటికి పిలిపించి బంధువులుగా పరిచయం చేసిందన్నాడు. తన బంధువుల దగ్గర నుంచి తీసుకొచ్చిన రూ.10 లక్షలతో పాటు తన ఇంట్లో సుమారు రూ.5 లక్షల విలువ చేసే బంగారంతో రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిందని తెలిపాడు. మొదటి భర్త వెంకటేశ్వర్లుతో కలిసి ఈ మోసాలకు పాల్పడుతోందని ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు.

ఇక మూడో పెళ్లి గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయపురం మండలానికి చెందిన యువకుడు ఐదేళ్లుగా సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. అతడికి సుహాసినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాథనని చెప్పడంతో యువకుడు కుటుంబ సభ్యులను ఒప్పించి గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే యువతికి 8 తులాల బంగారు నగలు పెట్టారు. ఇవి కాక అప్పులు ఉన్నాయంటూ అతడి దగ్గరి నుంచి రూ.4 లక్షలు, అతని తండ్రి నుంచి మరో రూ.2 లక్షలు తీసుకుంది. ఇది తెలిసి యువకుడు ఈ నెల 7న ఆమెను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

World Blood Donor Day 2021: రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..? మీరు ఈ రోగాల నుంచి తప్పించుకోవచ్చు..

Kim Jong Un: మరో ‘వార్‌’కు తెరలేపిన కిమ్.. క్రూరత్వానికి పరాకాష్ట.. తేడా వస్తే మరణశిక్షే.!

Funny Viral Video: వధువుకు కోపమొచ్చింది.. పెళ్లి పందిరిలోనే అలా చేసింది.. వచ్చినవారంతా షాక్..

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!