AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be Alert: చలిగా ఉందని రూమ్ హీటర్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ విషయాలు తెలుసా!

చలికాలం వచ్చిందంటే వణికించే చల్లని గాలులు, పొగమంచుతో శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ చలిని తట్టుకోవడానికి మనం రకరకాల పద్ధతులు అవలంబిస్తాం. మందపాటి బ్లాంకెట్లు, హీటర్లు, బ్లోయర్లు, ఎలక్ట్రిక్ హీటర్ బ్యాగులు, రూమ్ హీటర్లు, గది మూసుకుని వేడి నిలువ చేసుకోవడం. కొందరు ..

Be Alert: చలిగా ఉందని రూమ్ హీటర్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ విషయాలు తెలుసా!
Heater
Nikhil
|

Updated on: Dec 02, 2025 | 6:45 AM

Share

చలికాలం వచ్చిందంటే వణికించే చల్లని గాలులు, పొగమంచుతో శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ చలిని తట్టుకోవడానికి మనం రకరకాల పద్ధతులు అవలంబిస్తాం. మందపాటి బ్లాంకెట్లు, హీటర్లు, బ్లోయర్లు, ఎలక్ట్రిక్ హీటర్ బ్యాగులు, రూమ్ హీటర్లు, గది మూసుకుని వేడి నిలువ చేసుకోవడం. కొందరు రాత్రంతా హీటర్ ఆన్ చేసి హాయిగా నిద్రపోతారు.

కానీ ఈ సౌకర్యం వెనుక దాగి ఉన్న ప్రమాదాలు ఎవరికీ తెలియవు! ఆక్సిజన్ తగ్గడం, చర్మం పొడిబారడం నుంచి ఫైర్ హజార్డ్ వరకు హీటర్‌తో చాలా ప్రమాదం ఉంది. గదిలో హీటర్​ పెట్టుకుని నిద్రపోతే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..

  • హీటర్ గదిలోని గాలిని వేడి చేస్తుంది కానీ ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది. రాత్రంతా మూసిన గదిలో హీటర్​ పెడితే మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా తలనొప్పి, మైకం, ఉదయాన్నే అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.
  •  హీటర్ గాలిలోని తేమను పీల్చేస్తుంది. చర్మం పొడిబారడం, పెదవులు పగులు, దురద, అలర్జీలు మొదలవుతాయి. దీర్ఘకాలంలో చర్మం ముడతలు పడుతుంది.
  •  పొడి గాలి వల్ల గొంతు ఇరిటేట్ అవుతుంది. దగ్గు, జలుబు, సైనస్ సమస్యలు త్వరగా వస్తాయి. పిల్లలు, వృద్ధులకు ఈ ప్రమాదం ఎక్కువ. హీటర్ ధూళిని, బ్యాక్టీరియాను గాలిలోకి విడుదల చేస్తుంది. దీన్ పీల్చడం వల్ల అలర్జీ, ఆస్తమా రోగులకు శ్వాస సమస్యలు ముదిరిపోతాయి.
  •  శరీరం డీహైడ్రేట్ అవుతుంది. రాత్రంతా హీటర్ గాలి శరీరం నుంచి నీటిని ఆవిరి చేస్తుంది. ఉదయాన్నే నోరు ఎండిపోవడం, తలతిరగడం సహజం.
  •  చవకైన హీటర్లు ఓవర్‌హీట్ అయ్యి నిప్పు రావచ్చు. గత ఏడాది దేశవ్యాప్తంగా ౩౦౦కు పైగా ఫైర్ యాక్సిడెంట్లు హీటర్ల వల్లే జరిగాయి. హీటర్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి సరిగా నిద్ర పట్టదు. ఉదయాన్నే అలసట, చిరాకు వస్తాయి.
  •  హీటర్​ని రాత్రంతా ఆన్​లో ఉంచకుండా నిద్రపోయే 30 నిమిషాల ముందు ఆపేయాలి. గదిలో ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉంచాలి, దీనివల్ల గదిలో తేమ పెరుగుతుంది.
  •  ఆటో కట్​ ఆఫ్​ ఉండే మంచి క్వాలిటీ హీటర్​ని మాత్రమే ఉపయోగించాలి. గది కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల బయటనుంచి లోపలికి, లోపలి నుంచి బయటకు గాలి మార్పిడి జరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ హీటర్​ని ఉపయోగించవచ్చు.NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా