AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Milk Effects: శరీరంలోకి ప్రమాదకర ఇన్ఫెక్షన్.. పచ్చి పాలు ఎంత డేంజరో తెలుసా..?

పచ్చి పాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని కొందరు నమ్ముతారు. అందుకే.. పచ్చి పాలు తాగుతుంటారు.. ఇది ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలు బ్రూసెల్లా వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని పెంచుతుందని.. ఎప్పుడూ అలా చేయకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Raw Milk Effects: శరీరంలోకి ప్రమాదకర ఇన్ఫెక్షన్.. పచ్చి పాలు ఎంత డేంజరో తెలుసా..?
Raw Milk
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2025 | 3:48 PM

Share

కొంతమంది పచ్చి పాలు తాగుతారు.. ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది.. పచ్చి పాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని కొందరు నమ్ముతారు. కానీ కొన్నిసార్లు అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం కావచ్చు. పచ్చి పాలు తాగడం వల్ల కొన్నిసార్లు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జంతువుల ద్వారా వ్యాపించే వివిధ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్లలో బ్రూసెల్లా అత్యంత సాధారణమైనదిగా చెబుతారు.

పచ్చి పాలు తాగడం వల్ల ఇన్ఫెక్షన్..

బ్రూసెల్లా ఇన్ఫెక్షన్ పాడి జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంకా, ఇది పాల ద్వారా కూడా మానవులకు చేరుతోంది. చాలా మంది పచ్చి పాలను తాగడం వల్ల, ఈ ఇన్ఫెక్షన్ జంతువుల పాల ద్వారా వ్యాపిస్తుంది.. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుంది.

బ్రూసెల్లా అనేది బ్యాక్టీరియా వలన కలిగే ఒక జంతుజన్య వ్యాధి (zoonotic disease).. ఇది వైరస్ కాదు. ఈ వ్యాధి జంతువుల నుంచి లేదా కలుషితమైన జంతు ఉత్పత్తులు, ముఖ్యంగా పాశ్చరైజ్ చేయని పాలు, పచ్చి మాంసం ద్వారా సంక్రమిస్తుంది. దీని లక్షణాలలో జ్వరం, చెమటలు, తలనొప్పి, వెన్నునొప్పి, బలహీనత వంటివి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

ఎయిమ్స్ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన..

ఎయిమ్స్ హెల్త్ అవెర్‌నెస్ వీకెండ్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో, వైద్యులు ఈ ఆందోళన గురించి ప్రజలను అప్రమత్తం చేశారు. మానవ ఆరోగ్యం పర్యావరణంతో మాత్రమే కాకుండా జంతువులతో.. ముఖ్యంగా పెంపుడు జంతువులతో కూడా ముడిపడి ఉందని.. దీంతో వివిధ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వారు వివరించారు. అందువల్ల, మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను నిర్వహించడం చాలా అవసరం. అటువంటి వ్యాధులను నివారించడానికి, పాలు తాగే ముందు మరిగించాలని సూచించారు.

జబ్బుపడిన జంతువును ఎలా గుర్తించాలి?

అనేక అధ్యయనాలు 14 నుండి 16 శాతం పాడి పశువులకు బ్రూసెల్లా సోకుతుందని పేర్కొన్నాయి. ఒక జంతువు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇది తరచుగా సంభవిస్తుందని నిపుణులు అంటున్నారు. దీనిని గుర్తించడానికి, ఒక జంతువు ఆహారం తీసుకోవడం తగ్గించినప్పుడు, నీరసంగా మారినప్పుడు లేదా తక్కువ పాలు ఉత్పత్తి చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తు్న్నారు.

ప్యాక్ చేసిన పాలు కూడా ప్రమాదకరమా?

ఇంతలో, కొంతమంది ప్యాక్ చేసిన పాలు అలాంటి ప్రమాదాలను కలిగిస్తాయా అని ఆలోచిస్తూ ఉండవచ్చు.. కానీ.. ప్యాక్ చేసిన పాలతో ఎలాంటి సమస్య ఉండదు.. ఎందుకంటే.. ప్యాక్ చేసిన పాలు పాశ్చరైజ్ చేయబడినందున.. అది అలాంటి ప్రమాదాలను కలిగించదు. అయితే, ప్యాక్ చేసిన పాలను తాగే ముందు కూడా మరిగించాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..