AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఈ ఆకు ఉపయోగిస్తే చుండ్రు సమస్య ఉండదు..! ఎలాగో తెలుసుకోండి..

Beauty Tips: చాలామంది నిత్యం చుండ్రుతో బాధపడుతుంటారు. ఎన్ని షాంపులు వాడినా ఫలితం ఉండదు. అలాంటి సమయంలో ఇంట్లో దొరికే కరివేపాకుతో దీనిని

Beauty Tips: ఈ ఆకు ఉపయోగిస్తే చుండ్రు సమస్య ఉండదు..! ఎలాగో తెలుసుకోండి..
Dandruff
uppula Raju
| Edited By: |

Updated on: Oct 05, 2021 | 7:12 AM

Share

Beauty Tips: చాలామంది నిత్యం చుండ్రుతో బాధపడుతుంటారు. ఎన్ని షాంపులు వాడినా ఫలితం ఉండదు. అలాంటి సమయంలో ఇంట్లో దొరికే కరివేపాకుతో దీనిని పోగొట్టవచ్చు. ఇది చుండ్రు సమస్యకు చక్కటి పరిష్కారం. ఏ కూర తాలింపు వేసినా కరివేపాకు వుండాల్సిందే. మంచి సువాసన కలిగి ఆకుపచ్చని రంగులో వుండే కరివేపాకు అందరికీ అందుబాటులోనే వుంటుంది. అంతేకాదు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

కరివేపాకుకి చుండ్రు ని తగ్గించే గుణం ఉంటుంది. కొన్ని కరివేపాకు ఆకులు, సమానంగా నిమ్మపండు తొక్క,శీకాకాయ,పెసలు తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని అన్ని కలిపి పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఇలా నిల్వ చేసుకున్న పొడిని ఒక షాంపూ లాగా వాడుకోవటం వల్ల వారం రోజుల్లోనే చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి ఆకులు నల్లగా మారేంత వరకు చిన్న మంట మీద వేడి చేసి తరువాత వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న నూనెని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని జుట్టుకి వాడుకోవటం వల్ల జుట్టు పెరుగుదలకు, వెంట్రుకలు తెల్లబడకుండా సహాయపడుతుంది.

మొటిమల వల్ల ముఖం నల్లగా మారుతుంది. అటువంటి సమయంలో కరివేపాకును వాడాలి. అవి చర్మంపై శీతలీకరణ, శాంతించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీని కోసం కరివేపాకు ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లా చేసి, దానికి నిమ్మరసం కలిపి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. మంచి ఫలితాల కోసం ప్రతి మూడు, నాలుగు రోజులకు ఒకసారి ప్రయత్నించాలి. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్,పాస్ఫరస్,కాల్షియం,మెగ్నీషియం,అలాగే ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో విటమిన్ ఏ,బి,సి,ఈ లు కూడా అధికంగా ఉంటాయి.

ప్రపంచంలో ఈ 5 నదులు పొంగితే పెను విపత్తే..! ఇవి ఎక్కడున్నాయంటే..?

DC vs CSK, IPL 2021: ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌..

Viral Video: పెళ్లి కళ వచ్చేసిందే బాల.. వరుడు వస్తున్న ఆనందంలో ఈ వధువు ఏం చేసిందో చూశారా ?