AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆకులను రోజంతా నీటిలో నానబెట్టి రాత్రి నిద్రకు ముందు తాగారంటే.. ఆ సమస్యలన్నీ హాంఫట్!

కొత్తిమీరలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొత్తిమీర ఆకులను రోజంతా నీటిలో నానబెట్టి, పడుకునే ముందు తాగడం చాలా మంచిది. దీనిలోని ప్రయోజనకరమైన లక్షణాలు ఆరోగ్య సమస్యలను వాటి ప్రారంభ దశలలోనే నివారించడంలో సహాయపడతాయి..

ఈ ఆకులను రోజంతా నీటిలో నానబెట్టి రాత్రి నిద్రకు ముందు తాగారంటే.. ఆ సమస్యలన్నీ హాంఫట్!
కొత్తిమీర శరీరంలో ఇన్సులిన్ వాడకాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది గుండెకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. ఆకుపచ్చ కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడతాయి. డయాబెటిక్ రోగులకు ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.
Srilakshmi C
|

Updated on: Feb 16, 2025 | 3:10 PM

Share

కొత్తిమీర సువాసన బలేగా ఉంటుంది. అందుకే ఏ రకమైన వంటకాల్లోనైనా దీన్ని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. ఇది వంటల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన శక్తివంతమైన ఆకుకూర. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తాయి. కొత్తిమీర ఆకులను నీటిలో నానబెట్టి, పడుకునే ముందు ఆ నీటిని తాగడం లేదా మెత్తగా రుబ్బుకుని తాగడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వాటి ప్రారంభ దశలోనే తొలగిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, కొత్తిమీర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

రక్తాన్ని శుద్ధి చేస్తుంది

రాత్రిపూట కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఈ నీటికి ఆ శక్తి ఉందని వైద్యులు కూడా చెబుతున్నారు. సాధారణంగా అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించడానికి రాత్రిపూట కొత్తిమీర నీటిని తీసుకోవచ్చు. దీనిలోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదనంగా, కొత్తిమీర నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రేరేపిస్తుంది. ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.

బరువు తగ్గడానికి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొత్తిమీర నీళ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొత్తిమీర నీరు తక్కువ కేలరీలు కలిగిన పానీయం. ఇది జీవక్రియను పెంచుతుంది. కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు ఈ నీటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కాలక్రమేణా బరువు కూడా తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది

కొత్తిమీరలో మనసును ప్రశాంతపరిచే లక్షణాలు ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. అందుకే రాత్రిపూట ఈ నీటిని తాగడం వల్ల నాడీ వ్యవస్థ సడలింపు పొందుతుంది. ప్రశాంతమైన నిద్రని ప్రేరేపిస్తుంది. విటమిన్లు అధికంగా ఉండే కొత్తిమీర నీరు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై