Contact Lens Side Effects: కాంటాక్ట్ లెన్స్‌ వాడుతున్నారా? భయంకరమైన నిజాలు.. ఇప్పుడే తెలుసుకోండి..

ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల్లోనూ మార్పు వచ్చింది. వ్యక్తుల జీవన శైలి, అవలంభించే విధానాలు, ఆరోగ్య పరిస్థితులు, జీవిన విధానం, ఆలోచనా విధానం, ఫ్యాషన్, అన్ని అంశాలూ పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ అధిక వినియోగం, సరికాని ఆహారపు అలవాట్ల కారణంగా.. చాలా మంది కంటి చూపు సమస్యలతో సతమతం అవుతున్నారు.

Contact Lens Side Effects: కాంటాక్ట్ లెన్స్‌ వాడుతున్నారా? భయంకరమైన నిజాలు.. ఇప్పుడే తెలుసుకోండి..
Contact Lenses
Follow us
Shiva Prajapati

|

Updated on: May 12, 2023 | 3:22 PM

ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల్లోనూ మార్పు వచ్చింది. వ్యక్తుల జీవన శైలి, అవలంభించే విధానాలు, ఆరోగ్య పరిస్థితులు, జీవిన విధానం, ఆలోచనా విధానం, ఫ్యాషన్, అన్ని అంశాలూ పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ అధిక వినియోగం, సరికాని ఆహారపు అలవాట్ల కారణంగా.. చాలా మంది కంటి చూపు సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు ప్రజలు కంటి చూపు మెరుగ్గా కనిపించేందుకు కళ్లద్దాలను వాడేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. కళ్ల జోడు స్థానంలో.. కాంటాక్ట్ లెన్స్‌లు వచ్చాయి. కంటి చూపు తక్కువగా ఉన్నవారు కాంటాక్ట్ లెన్స్‌లను పెట్టుకుంటున్నారు. అయితే, ఈ కాంటాక్ట్ లెన్స్‌లు కంటి చూపు మందగించిన వారే కాకుండా.. కళ్ల రంగును మార్చాలనుకునే వారు కూడా వాడుతున్నారు.

కళ్లద్దాలు ధరించడం వల్ల కలిగే ఇబ్బందులను దూరం చేయడంలో కాంటాక్ట్ లెన్స్‌లు ఎంతగానో దోహదపడ్డాయనడంలో సందేహం లేదు. అయితే, కాంటాక్ట్ లెన్స్‌లను పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల కూడా అవగాహన తప్పనిసరిగా ఉండాలి. కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం చూడటానికి బాగుండొచ్చు. కానీ, వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంటాక్ట్స్ లెన్స్‌ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కాంటాక్ట్ లెన్సులు ధరించడం వల్ల కలిగే నష్టాలు..

1. అలర్జీలు: ఎక్కువ సేపు కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల కళ్లలో అలర్జీ సమస్యలు వస్తాయి. దీని కారణంగా దురద, మంట, కళ్ళ వెంట నీరు కారడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గాలిలో ఉండే అలర్జీ కణాలు కాంటాక్ట్ లెన్స్‌లో చేరుతాయి. తద్వారా కంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఇవి కూడా చదవండి

2. కళ్లు ఎర్రగా ఉంటాయి: కాంటాక్ట్ లెన్సులు ధరించడం వల్ల వచ్చే మరో సమస్య ఇది. కాంటాక్ట్ లెన్సులు ఎక్కువగా వాడటం వల్ల కళ్ళు ఎర్రగా మారతాయి. బ్రాండెడ్ కాంటాక్ట్ లెన్స్‌లు వాడితే ఎలాంటి సమస్య ఉండదని కాదు. ఏదైనా కాంటాక్ట్ లెన్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ కళ్లకు హాని కలిగే ఆస్కారం ఉంది.

3. అస్పష్టమైన దృష్టి: ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం వల్ల చూపు మందగిస్తుంది. అంతే కాదు అనేక కంటి వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి.

4. కంటి ఇన్ఫెక్షన్: కాంటాక్ట్ లెన్స్‌ల వల్ల కూడా కంటి ఇన్ఫెక్షన్ రావచ్చు. కాంటాక్ట్ లెన్స్ సరిగ్గా సరిపోకపోతే, కార్నియాపై రాపిడి జరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.

5. కళ్లలో నొప్పి: ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్సులు ధరించడం వల్ల కళ్లలో నొప్పి వస్తుంది. కాంటాక్ట్ లెన్స్‌ల కారణంగా కంటి నొప్పి వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు వాటిని ఉపయోగించకుండా ఉండాలి. దీనివల్ల భవిష్యత్తులో చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

6. కళ్లలో ఆక్సిజన్ లేకపోవడం: కళ్లకు కూడా తగినంత ఆక్సిజన్ అవసరం. కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువసేపు కళ్ళలో ఉంచుకుంటే, తరచుగా వాటిని ధరించి నిద్రపోతే.. కళ్ళకు ఆక్సిజన్ సరిగా అందదు. ఫలితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..