Coffee Face Scrub: కాఫీ ఫేస్ స్క్రబ్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేశారంటే పార్లర్ వంటి మెరుపు మీ సొంతం
కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం అవ్వదు. ఉదయానే ఓ కప్పు ఘుమ ఘుమలాడే కాఫీ తాగితే రోజంతా ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తే.. కాఫీ చుక్కలు గొంతును తడిపితే అలసట మొత్తం పరారవుతుంది. తక్షణం రిఫ్రెష్‌గా ఉంచుతుంది. అయితే కాఫీ చర్మంపై కూడా ఇదే విధమైన తాజా అనుభూతిని కలిగిస్తుందని సౌందర్య నిపుణులు అంటున్నారు. కాఫీలో కెఫీన్ సమ్మేళనం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు డల్ స్కిన్‌కి తాజాదనాన్ని..

కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం అవ్వదు. ఉదయానే ఓ కప్పు ఘుమ ఘుమలాడే కాఫీ తాగితే రోజంతా ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తే.. కాఫీ చుక్కలు గొంతును తడిపితే అలసట మొత్తం పరారవుతుంది. తక్షణం రిఫ్రెష్‌గా ఉంచుతుంది. అయితే కాఫీ చర్మంపై కూడా ఇదే విధమైన తాజా అనుభూతిని కలిగిస్తుందని సౌందర్య నిపుణులు అంటున్నారు. కాఫీలో కెఫీన్ సమ్మేళనం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు డల్ స్కిన్‌కి తాజాదనాన్ని తీసుకురావడంలో ఉపయోగపడతాయి.
ఎక్స్‌ఫోలియేటర్
కాఫీ పౌడర్ చర్మంపై సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. కాఫీ పౌడర్‌లో కొబ్బరి నూనె లేదా పెరుగు కలిపి ముఖంతోపాటు ఇతర శరీర భాగాలను స్క్రబ్ చేయవచ్చు. అలాగే కాఫీ పొడిలో ఆలివ్ ఆయిల్ కూడా కలిపి స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, తాజాగా మార్చుతుంది. అయితే చర్మం దీనిని మరీ గట్టిగా రుద్దకూడదు.
హెయిర్ మాస్క్
కాఫీ చర్మంతోపాటు జుట్టు స్థితిస్థాపకతను పెంచడంలోనూ సహాయపడుతుంది. ఒక కప్పు బ్లాక్ కాఫీ వేడి చేసి చల్లబరచుకోవాలి. షాంపూతో తనస్నానం చేసిన తర్వాత ఈ బ్లాక్ కాఫీని జుట్టు మీద పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాఫీలోని పోషకాలు జుట్టును ఆరోగ్యం ఉండేలా చేస్తుంది. ఇది పొడి జుట్టు సమస్యను కూడా తొలగిస్తుంది.
ఐ మాస్క్
కళ్ల కింద వాపును తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది. కాస్త కాఫీ పౌడర్‌లో పెరుగు లేదా తేనె మిక్స్ చేసి కళ్ల కింద అప్లై చేయాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
లిప్ స్క్రబ్
కాఫీ పెదాల సంరక్షణకు కూడ ఉపయోగించవచ్చు. కాఫీతో ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల పెదవులు మృదువుగా మారుతాయి. అలాగే పెదవులకు గులాబీ రంగు సంతరించుకుని, శాశ్వతంగా అలాగే ఉంటుంది. తేనె లేదా కొబ్బరి నూనెతో కాఫీ మిక్స్ చేసి పెదవులపై తేలికగా రుద్దుకోవాలి. ఈ స్క్రబ్ మీ పెదాలను మృదువుగా చేసి, పెదవులపై మృత కణాలను తొలగిస్తుంది.
ఫేస్ మాస్క్
పార్లర్‌కి వెళ్లడం ద్వారా కాకుండా ఇంట్లోనే కాఫీ ద్వారా సహజంగా ముఖానికి కాంతిని తీసుకురావచ్చు. కాఫీ పొడిలో పుల్లటి పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అలాగే పుల్లని పెరుగు చర్మాన్ని తేమగా మారుస్తుంది.
ఫుట్ స్క్రబ్
కాఫీ పౌడర్‌లో ఎప్సమ్ సాల్ట్, ఆలివ్ ఆయిల్ కలుపుకుని ఫుట్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్రబ్‌ని పాదాలకు రుద్దడం వల్ల పాదాలపై ఉన్న మరకలన్నీ తొలగిపోతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








