Cholesterol Control Tips: కొలెస్ట్రాల్‌ వెన్నలా కరిగించే దివ్య ఔషధం.. మన వంటింట్లోనే ఉంది!

ప్రస్తుతం అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది విచ్చలవిడిగా పెరుగుతోంది. దీంతో పలు దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె పోటు వంటి సమస్యలు.. అధిక కొలెస్ట్రాల్ కారణంగానే వస్తున్నాయి. ఎక్కువగా 40 సంవత్సరాల వయస్సు మళ్లిన వారిలో కొవ్వు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో కొన్ని సంవత్సరాల పాటు కొవ్వు నిల్వ ఉండటం వల్ల..

Cholesterol Control Tips: కొలెస్ట్రాల్‌ వెన్నలా కరిగించే దివ్య ఔషధం.. మన వంటింట్లోనే ఉంది!
Cholesterol Reduce Foods
Follow us
Chinni Enni

|

Updated on: Feb 12, 2024 | 1:14 PM

ప్రస్తుతం అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది విచ్చలవిడిగా పెరుగుతోంది. దీంతో పలు దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె పోటు వంటి సమస్యలు.. అధిక కొలెస్ట్రాల్ కారణంగానే వస్తున్నాయి. ఎక్కువగా 40 సంవత్సరాల వయస్సు మళ్లిన వారిలో కొవ్వు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో కొన్ని సంవత్సరాల పాటు కొవ్వు నిల్వ ఉండటం వల్ల తెలుపు రంగులోకి మారిపోతుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ పరిమాణాలు కణాల్లో పేరుకుపోయిన ఇన్ ప్లామేషన్ తయారవుతుంది. అయితే దీని కారణంగానే శరీరంలో ఫ్రీ రాడికల్స్ తయారవుతున్నాయని, దీని వల్ల ప్రాణానికే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపఉనులు చెబుతున్నారు.

అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. తినే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. కొలెస్ట్రాల్‌ తగ్గించడానికి కేవలం మందులే కాకుండా.. ఇంట్లో ఉండే ఔషధాలతో కూడా చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగినా.. వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి లవంగాలు ఎంతో బాగా హెల్ప్ చేస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మీరు తినే ఆహారంలో తరచూ లవంగాలను ఉపయోగిండం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయని చెబుతున్నారు.

లవంగాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా లవంగాల వివిధ సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో యూజనల్ అనే రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతే కాకుండా లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పరిణామాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా లవంగాల్లో ఉండే కొన్ని రసాయనాలు కొవ్వు కణాల్లో పేరుకుపోయిన ఇన్ ప్లామేషన్‌ను తొలగించేందుకు కూడా సహాయ పడతాయని ఇటీవలే జరిగిన పరిశోధనల్లో తేలినట్టు నిపుణులు వెల్లడించారు. కాబట్టి కొలెస్ట్రాల్‌తో బాధ పడేవారు నిత్యం లవంగాలను తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ప్రతి రోజూ లవంగాలను నమిలి తినడం వల్ల నోటి ఆరోగ్యంతో పాటు శరీరంలోని అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి తప్పుకోవచ్చన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.