Child Care: పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే.. జాగ్రత్త పడకపోతే ప్రమాదమే..!
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చాలా జాగ్రత్తగా, ఆరోగ్యంగా పెంచాలి అని అనుకుంటారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. కానీ తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పులు మీ పిల్లల..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చాలా జాగ్రత్తగా, ఆరోగ్యంగా పెంచాలి అని అనుకుంటారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. కానీ తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పులు మీ పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా తల్లిదండ్రలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
ఇక పాలల్లో అధిక పోషకాలు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే తల్లులు తమ పిల్లలు తాగకపోయినా బలవంగా తాగిస్తుంటారు. ఇలా తాగించడం మంచిదే కానీ.. పాలల్లో చక్కెర వేయడం మంచిది కాదంటున్నారు. ఉత్త పాలు పిల్లలు తాగడం లేదు అని చాలా మంది తల్లులు అందులో షుగర్ వేసి ఇస్తారు. ఇంకొందరేమో పాలల్లో అధికంగా చక్కెర వేసి కూడా ఇస్తుంటారు.
ఇక పిల్లలు ఎక్కువగా ఇష్టపడేవి చాకోలెట్స్. అవి వారికి ఏ మాత్రం మంచిది కాదు. పిల్లలకు చాకోలెట్స్ ఇవ్వకపోవడం మంచిది. అవి తింటే పళ్ళు పాడవుతాయి. అందుకే ఫ్రూట్స్ తినేలా అలవాటు చేయాలి. ఫ్రూట్స్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. వాటిని అలవాటు చేయడం మంచిది. పిల్లలకు అవేమి చెప్పకుండా ఆరోగ్యానికి హాని కలిగించేవే ఎక్కువ అందిస్తుంటారు.
తీపి పదార్థాలు, పంచదారతో తయారు చేసిన ఆహారాలని పిల్లలకు ఎక్కువగా తినిపించకూడదు. ప్రస్తుత కాలంలో పసిపిల్లలకి తల్లిదండ్రులు ఎక్కువగా చాక్లెట్లని అలవాటు చేస్తున్నారు. ఈ చాక్లెట్లు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. కానీ వీటిలో ఉండే రసాయనాలు పిల్లలకు అనారోగ్యం కలిగిస్తాయి. తీపి విషయాలు పిల్లల శారీరక అభివృద్ధిపై మాత్రమే కాకుండా మానసిక అభివృద్ధిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయని గుర్తుంచుకోండి.
ఇక కాల్చిన మాంసం చిన్నపిల్లలకి అస్సలు తినిపించకూడదు. చిన్నపిల్లలే కాదు వృద్ధులు కూడా వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి మాంసాన్ని తినిపిస్తారు. ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు కావాలంటే ఉడికించిన మాంసాన్ని పిల్లలకి తినిపించవచ్చు.
పిల్లల్లో లివర్ ఇన్ఫెక్షన్
పిల్లల్లో లివర్ ఇన్ఫెక్షన్ వారి శారీరక ఎదుగుదలతోపాటు జీర్ణవ్వవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ పిల్లలకు జంక్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడ్డారు. ఇంట్లో తయారు చేసిన రుచికరమైన ఆహారం కంటేనూ.. పిజ్జా, బర్గర్లు, నూడుల్స్, చిప్స్ మొదలైనవి తినడానికి ఇష్టపడతారు. వీటిలో చాలా వరకు మైదా నుంచి తయారు చేస్తారు. వీటిలో నూనె, మసాలాలు అధికంగా ఉపయోగిస్తారు. సాధారణంగా కొంతమంది తల్లులు పిల్లల మధ్యాహ్న భోజనంగలో నూడుల్స్ , ఫ్రై బ్రెడ్ మొదలైన రిచ్, నూన్ పదార్థాలను పెడుతుంటారు. ఈ ఫుడ్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు అధిక కొవ్వు కాలేయ అనారోగ్యానికి ప్రధాన కారణం అవుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి