AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: శత్రువులను ఓడించేందుకు చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా..?

జీవితంలో విజయానికి స్నేహితులే కాదు, శత్రువులు కూడా అవసరమేనని చాణక్యుడు చెబుతాడు. మన ఎదుగుదలకు, బలంగా మారేందుకు శత్రువుల వ్యూహాలు కూడా ఒక మార్గం చూపుతాయి. శత్రువులను ఎలా గుర్తించాలి..? వారిని ఎలా ఎదుర్కోవాలి..? ఈ విషయాల్లో చాణక్యుడి నిబంధనలను అనుసరించడం వల్ల విజయం సాధించవచ్చు.

Chanakya Niti: శత్రువులను ఓడించేందుకు చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా..?
Chanakya Niti
Prashanthi V
|

Updated on: Mar 08, 2025 | 8:32 PM

Share

చాణక్యుడి నిబంధనల ప్రకారం జీవితంలో ముందుకు సాగేందుకు స్నేహితులు ఎంత ముఖ్యమో శత్రువులు కూడా అంతే అవసరం. ఎందుకంటే మన శత్రువులే మన విజయానికి కారణమవుతారు. జీవితంలో శత్రువులను ఎదుర్కోవడం అంత సులభం కాదు. కొన్నిసార్లు మన శత్రువులను మనం గుర్తించలేము. కానీ కంటికి కనిపించని శత్రువు కూడా మనకు కష్టాలు, దురదృష్టం తెచ్చిపెట్టగలడు.

మనకు తెలియకుండానే కొందరు మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు మనకు ప్రత్యక్షంగా ఎదురు కాకుండా.. స్నేహపూర్వకంగా నటిస్తూ, మనకు సహాయం చేస్తునట్లు నటిస్తారు. ఇలాంటి వారు మంచి పేరు కోల్పోయిన శత్రువులకన్నా ఇంకా ప్రమాదకరమైనవారు. ఇలాంటి వారిని గుర్తించి వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి.

శత్రువులకు ప్రతిఘటనగా మనస్సు మీద ఆధిపత్యం కలిగి ఉండటమే మొదటి పద్ధతి. చాణక్యుడి మాటల్లో శత్రువులను శక్తితో అదుపులో పెట్టకూడదు. వారికి మనసులో స్థానం సంపాదించాలి. ఎంత బలంగా ఉన్నా శత్రువుల బలహీనతలను అర్థం చేసుకుని వారి మనస్సులోకి ప్రవేశించాలి.

శత్రువుల మనస్సును అర్థం చేసుకున్నవారు విజయానికి అడ్డుగా ఉన్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు కనుగొంటారు. ఇది విజయానికి దారి తీస్తుంది. శత్రువుతో వాదనకు దిగకుండా ఉండటం మంచిదని చాణక్యుడు చెబుతాడు. వాదనలోకి దిగే ముందు, ఆ వాదన వల్ల కలిగే మంచి-చెడులను ఆలోచించాలి.

వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం.. మన శత్రువులతో కూడా సహనంతో, స్పష్టంగా మాట్లాడటం. మాటలే యుద్ధంలో ముఖ్యమైన ఆయుధాలు. వారిని అవమానించడం లేదా నిందించడం వల్ల మాత్రమే ప్రతిఘటన పెరుగుతుంది. కాబట్టి వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి, పరస్పరంగా అర్థం చేసుకునేలా చూడాలి.

శత్రువులను ఎదుర్కోవడానికి వారు ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారో తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన పద్ధతిగా చాణక్యుడు చెబుతాడు. శత్రువులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనకు అవగాహన ఉంటే వారు ఏం చేయబోతున్నారో ముందుగానే అంచనా వేయగలుగుతాము.

శత్రువులను ఎదుర్కోవడంలో విజయవంతం కావాలంటే మన మాటలు కంటే మన చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మన అనుభవాలను , రహస్యాలను సన్నిహితులకి మాత్రమే చెప్పాలి.