Sunscreen in Monsoon: వర్షా కాలంలో సన్ స్క్రీన్ ఉపయోగిస్తే ఏంటి లాభం..
నిన్న మొన్నటి దాకా ఎండలతో ప్రజలు అల్లాడి పోయారు. ఆ ఎండలో బయటకు వెళ్లాలంటేనే భయం వేసేది. కాసేపు బయటకు వెళ్లినా చర్మం ట్యాన్ అయ్యేది. దీంతో ఎండకు భయపడి సన్ స్క్రీన్స్ ఉపయోగించే వారు. యూవీ కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల స్కిన్ క్యాన్సర్, గీతలు, నలుపుదనం, ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే చర్మాన్ని కాపాడేందుకు సన్ స్క్రీన్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వాతావరణంలో పరిస్థితులు..

నిన్న మొన్నటి దాకా ఎండలతో ప్రజలు అల్లాడి పోయారు. ఆ ఎండలో బయటకు వెళ్లాలంటేనే భయం వేసేది. కాసేపు బయటకు వెళ్లినా చర్మం ట్యాన్ అయ్యేది. దీంతో ఎండకు భయపడి సన్ స్క్రీన్స్ ఉపయోగించే వారు. యూవీ కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల స్కిన్ క్యాన్సర్, గీతలు, నలుపుదనం, ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే చర్మాన్ని కాపాడేందుకు సన్ స్క్రీన్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వాతావరణంలో పరిస్థితులు మారాయి. రోజులో ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో చాలా మంది సన్ స్క్రీన్ ఉపయోగించాలా? వద్దా? అయినా ఎండ లేదుగా ఇప్పుడు అవసరం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
ప్రమాదంలో పడినట్లే..
మీరు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలో పడినట్లే అని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఎండ లేదు కాబట్టి సన్ స్క్రీన్ రాయాల్సిన అవసరం లేదని చాలా మంది మానేస్తూ ఉంటారు. కేవలం ఎండ వల్లనే కాదు మన చుట్టూ ఉండే వస్తువుల వల్ల కూడా సమస్యలు ఉంటాయని చెబుతున్నారు. మొబైల్, టీవీ, కంప్యూటర్ నుంచి వచ్చే వెలుతురు వల్ల కూడా చర్మాన్ని డల్‌గా మారుస్తాయట. కాబట్టి కాలం ఏదైనా సరే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా స్కిన్ కేర్‌లో ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
వాటర్ ఫ్రూఫ్ సన్ స్క్రీన్ వాడాలి..
వర్షంలో తడిచి పోతాం కదా.. మరి ఎలా? అనే డౌట్ వచ్చే ఉంటుంది. మీరు వర్షంలో ఎక్కువగా తడవాల్సి వస్తే వాటర్ ఫ్రూఫ్ సన్ స్క్రీన్ ఉపయోగించమని చెబుతున్నారు. అది కూడా ఒక్కసారి రాస్తే సరిపోదు. మూడు, నాలుగు గంటలకు ఒకసారి రాయాలి.
సన్ స్క్రీన్ తర్వాతే మేకప్..
చాలా మంది మేకప్ వేసుకుంటున్నాం కదా.. సన్ స్క్రీన్ అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు అని స్కిన్ కేర్ నిపుణులు అంటున్నారు. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాశాకే ఫౌండేషన్ వేయాలి. సన్ స్క్రీన్ చక్కగా చర్మంలోకి ఇంకిపోయాకే మేకప్ స్టార్ట్ చేయాలట. అప్పుడే మీ చర్మం పొడవకుండా చక్కగా ఉంటుందని సూచిస్తున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








