Ivy Gourd: షుగర్ పేషెంట్స్ దొండకాయ తినొచ్చా.. తింటే జరిగేది ఇదే!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ ఒకసారి వచ్చిందంటే కంట్రోల్ చేసుకోవడం తప్ప.. తగ్గదు. డయాబెటీస్‌ను కంట్రోల్ చేసేందుకు ఎన్నో చిట్కాలు తెలుసుకున్నాం. దొండకాయ తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు.

Ivy Gourd: షుగర్ పేషెంట్స్ దొండకాయ తినొచ్చా.. తింటే జరిగేది ఇదే!
Ivy Gourd
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2024 | 10:30 PM

కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. దొండకాయ అంటే చాలా మందికి నచ్చదు. కానీ దొండకాయలో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. శరీర ఆరోగ్యానికి కావాల్సిన కొన్ని పోషకాలు.. దొండకాయలో లభిస్తాయి. దొండకాయలు తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే దొండకాయ తింటే మతి మరుపు వస్తుందని చాలా మంది తినరు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. దొండకాయ తినడం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి. కానీ దొండకాయలో ఎన్ని లాభాలు ఉన్నా.. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నావరు, మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధ పడేవారు దొండకాయలను తినకపోవడమే మంచిది. దొండకాయలోనే కాదు ఈ మొక్క ఆకులు, వేర్లలో కూడా పలు ఔషధ గుణాలు లభిస్తాయి. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న దొండకాయను షుగర్‌తో బాధ పడేవారు తినొచ్చా? తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ ఉన్నవాళ్లు దొండకాయ తినవచ్చా..

ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. షుగర్‌ను కంట్రోల్ చేసుకోవడం తప్ప.. నయం చేయలేం. కాబట్టి పలు రకాల ఆహారాలు తినడం వల్ల హ్యాపీగా డయాబెటీస్‌ తగ్గించుకోవచ్చు. దొండకాయ తినడం వల్ల షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో గ్లూకోజ్ నెమ్మదిగా గ్రహించేలా చేస్తాయి.

అంతే కాకుండా సెన్సిటివిటీని కూడా పెంచి.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది. డయాబెటీస్‌తో బాధ పడేవారు తరచూ దొండకాయ తింటే.. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దొండకాయలతో రసం కూడా తీసుకుని తాగవచ్చు. దొండకాయల ఆకుల రసం తీసుకున్నా కూడా డయాబెటీస్‌ను కంట్రోల్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరెన్నో ప్రయోజనాలు..

దొండకాయతో ఇతర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. దొండకాయ ఆకుల కషాయం తాగడం వల్ల జ్వరం, కామెర్లు, క్యాన్సర్ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆకులను ముద్దగా చేసి.. చర్మ సమస్యలను నయం చేయవచ్చు. దొండకాయ ఆకులు, కాండంతో కషాయం చేసి తాగితే దగ్గు, ఉబ్బసం వంటి వాటికి కూడా ఉపశమనం కలుగుతుంది. కడుపులో ఉండే పురుగులు బయటకు పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.