- Telugu News Photo Gallery Surprising health benefits of eating clove empty stomach details in telugu
Clove Benefits: వామ్మో.. రోజూ ఖాళీ కడుపుతో లవంగాలు తింటే ఇన్ని లాభాలా..?
Benefits of Cloves: లవంగాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. రోజూ ఒక లవంగాన్ని నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే లవంగాలను న్యూట్రీషియన్ పవర్‌హౌస్‌గా పిలుస్తారు. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యూజీనాల్ ఉన్నాయి. ఇది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్..
Updated on: Nov 18, 2024 | 9:42 PM

నోటిపూత, గొంతు నొప్పికి లవంగం ఔషధం. రోజూ లవంగాలు తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పిని గణనీయంగా తగ్గించుకోవచ్చు. లవంగాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. లవంగాలను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

చర్మ సమస్యలకు కూడా లవంగంతో చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం లవంగాన్ని మెత్తగా నూరి, మొటిమల మీద రాస్తే, మొటిమ పక్కకు విస్తరించకుండా త్వరగా రాలిపోతుంది. అలాగే, వాంతి అవుతుందనిపించినప్పుడు లవంగాన్ని వాసన చూడాలి. అలాగే లవంగం రసాన్ని చప్పరించినా ఫలితం ఉంటుంది.

దంత సమస్యలను నివారించే శక్తి కూడా లవంగాలకు ఉంది. లవంగాలలో ఉండే యాంటీ జింజివిటిస్, యాంటీప్లేక్ లక్షణాలు దంతాలను ఆరోగ్యంగా ఉండటానికి సహయపడతాయి.. లవంగాలు నోటిలోని సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడటమే కాకుండా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్, మంట, నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి.

ఆహారంలో లవంగాలను ఎలా చేర్చుకోవాలంటే.. ఉదయం టీలో 2-3 లవంగాలను జోడించి తాగవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో లవంగాలను వేసి రోజంతా త్రాగవచ్చు. వంగాల పొడిని సూప్‌లు, డెజర్ట్‌లపై చల్లి వినియోగించవచ్చు.

అంతేకాకుండా లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నోటి ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహిస్తాయి. మృదువైన చర్మం అందిస్తాయి.




