AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలు వెండి మంగళసూత్రం ధరిస్తే ఏమవుతుంది..? మీకు తెలియని అసలు నిజాలు ఇవే..

మంగళసూత్రం.. వైవాహిక బంధానికి నిలువెత్తు సాక్ష్యం.. ఇప్పటివరకు మనం బంగారు వెలుగుల మంగళసూత్రాలనే చూశాం.. కానీ ఇప్పుడు మార్కెట్‌లో సరికొత్త వెండి మంగళసూత్రాల హవా నడుస్తోంది. తేలికగా, స్టైలిష్‌గా ఉండే ఈ డిజైన్లకు ఇటు మోడ్రన్ మహిళలు ఫిదా అవుతున్నారు. అయితే వెండితో చేసిన ఈ సూత్రాలను మెడలో వేసుకోవడం మంచిదేనా అనే డౌట్లు చాలామందిలో ఉన్నాయి. ఆ విషయాలు తెలుసుకుందాం..

మహిళలు వెండి మంగళసూత్రం ధరిస్తే ఏమవుతుంది..? మీకు తెలియని అసలు నిజాలు ఇవే..
Can Married Women Wear Silver Mangalsutra
Krishna S
|

Updated on: Jul 14, 2026 | 5:54 PM

Share

భారతీయ సంస్కృతిలో వివాహిత మహిళలకు మంగళసూత్రం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అది వారి పవిత్ర బంధానికి నిలువెత్తు రూపం. సాంప్రదాయకంగా మంగళసూత్రాన్ని బంగారంతోనే తయారు చేసినప్పటికీ.. ఇటీవలి కాలంలో వెండి మంగళసూత్రాలు బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు మహిళలు వెండితో చేసిన మంగళసూత్రాన్ని ధరించవచ్చా? శాస్త్రాలు దీనిని అంగీకరిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత మారుతున్న జీవనశైలిలో వెండి మంగళసూత్రాలు ఒక సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. ఇవి తేలికగా ఉండటం, ప్రతిరోజూ ఆఫీసులకు లేదా బయటకు వెళ్లేటప్పుడు ధరించడానికి సౌకర్యవంతంగా ఉండటం వీటి ప్రధాన ప్లస్ పాయింట్. అంతేకాకుండా మోడ్రన్, సాంప్రదాయ దుస్తులతో ఇవి సులభంగా సెట్ అవుతాయి. వెండి, నల్ల పూసలు, ఆకర్షణీయమైన డిజైనర్ పెండెంట్ల కాంబినేషన్‌లో సరికొత్త మోడల్స్ ఇప్పుడు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. బడ్జెట్ పరంగానూ ఇవి అందరికీ అందుబాటు ధరలో ఉంటున్నాయి.

శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

హిందూ సంప్రదాయంలో వెండికి ప్రత్యేక ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. వెండి అనేది చంద్రుడికి ప్రతీక అని.. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుందని నమ్ముతారు. కాబట్టి శాస్త్రాల ప్రకారం వెండి మంగళసూత్రాన్ని ధరించడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే సాంప్రదాయక నమ్మకాల ప్రకారం పెళ్లి సమయాల్లో ఎక్కువగా బంగారు మంగళసూత్రాలకే ప్రాధాన్యత ఇస్తారు. బంగారం అనేది శ్రేయస్సుకు, శుభప్రదానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావించడమే దీనికి కారణం. అందుకే ఇప్పటికీ చాలా కుటుంబాలు పెళ్లి తంతులో బంగారు సూత్రాలనే వాడుతుంటారు.

ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపికేనా?

కుటుంబంలో లేదా సమాజంలో నిర్దిష్టమైన మతపరమైన ఆచారాలు, కఠినమైన సంప్రదాయాలు ఉంటే తప్ప.. వెండి మంగళసూత్రాన్ని ఎంచుకోవడం అనేది పూర్తిగా మహిళల వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. నేటి తరం మహిళలు తమ బడ్జెట్, డిజైన్ మరియు నిత్యం వేసుకోవడానికి వీలుగా ఉండే సౌకర్యాన్ని బట్టి వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.

లోహం కాదు.. భావోద్వేగం ముఖ్యం..

మంగళసూత్రం అసలైన గుర్తింపు అది ఏ లోహంతో తయారైంది అనే దానిపై ఆధారపడి ఉండదు. దాని వెనుక ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక ప్రాముఖ్యతే అత్యంత కీలకమైనది. భార్యాభర్తల మధ్య ఉండే నిఖార్సైన ప్రేమ, నమ్మకం, సహచర్యం, జీవితకాల బంధానికి ఇది ఒక అద్దం పడుతుంది. పెళ్లి రోజున తీసుకున్న ఏడడుగుల ప్రమాణాలకు గుర్తుగా నిలిచే మంగళసూత్రం, వెండిదైనా, బంగారానిదైనా మహిళల హృదయానికి ఎప్పుడూ ప్రత్యేకమైనదే.

Follow Us
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర