Bread Omelette: బ్రెడ్ ఆమ్లెట్ లేదా మొలకలు.. టిఫిన్‌కి ఏది బెస్ట్..! వీరికి మాత్రం డేంజర్
బరువు తగ్గేవారికి బ్రెడ్ ఆమ్లెట్, మొలకలు రెండూ ప్రయోజనకరమే. బ్రెడ్ ఆమ్లెట్‌లో అధిక ప్రొటీన్.. ఆకలిని తగ్గిస్తుంది. అయితే తక్కువ నూనెతో, వైట్ బ్రెడ్ లేకుండా తీసుకోవాలి. మొలకలలో అధిక ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి, కొవ్వును కరిగిస్తుంది. నిపుణుల ప్రకారం, బరువు తగ్గడానికి మొలకలు మెరుగైన ఆప్షన్.

మనం ఉదయం తీసుకునే అల్పాహారం ఆ రోజంతా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు బ్రెడ్ ఆమ్లెట్ లేదా మొలకలు లాంటి అధిక ప్రొటీన్ ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఈ రెండు ఆహారాలు బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ఏది ఎక్కువ బలాన్ని చేకూరుస్తుందనే సందేహం ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం, బ్రెడ్ ఆమ్లెట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది, కానీ తక్కువ నూనెతో తయారు చేయాలి. రెండు గుడ్లు, రెండు బ్రెడ్ ముక్కల ఆమ్లెట్‌లో 250-350 క్యాలరీలు, 18-22 గ్రాముల ప్రొటీన్ ఉంటాయి. గుడ్లలోని ప్రొటీన్ ఆకలిని తగ్గిస్తుంది. అయితే, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉండే తెల్ల బ్రెడ్‌కు దూరంగా ఉండాలి.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
మొలకలు బరువు తగ్గేవారికి మరొక అద్భుతమైన ఆప్షన్. 100 గ్రాముల మొలకల్లో కేవలం 25-50 క్యాలరీలు, 3-9 గ్రాముల ప్రొటీన్, 1.5-2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. మొలకలలోని అధిక ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కొవ్వును కరిగిస్తుంది. వీటిలో విటమిన్ సి, ఎంజైములు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గడానికి మొలకలు ఉత్తమమని నిపుణులు అంటున్నారు. అయితే వారానికి రెండు, మూడు సార్లు బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవడం కూడా ప్రయోజనకరమే. బ్రెడ్ ఆమ్లెట్ తయారుచేసేటప్పుడు, 10 గ్రాముల కంటే ఎక్కువ నూనెను వాడకూడదు. మీకు థైరాయిడ్ లేదా మూత్రపిండాల వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే, ఈ ఆహారాలను తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. మొత్తంగా, మొలకలు బరువు తగ్గడంలో మెరుగైన ఆప్షన్ అయినప్పటికీ, వారానికి రెండు లేదా మూడు సార్లు బ్రెడ్ ఆమ్లెట్ తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




