AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతకాలం నాటి నల్ల బంగారం.. మిరియాల రసం ఇలా తాగరంటే జలుబు, దగ్గు దెబ్బకు పరార్..

మిరియాలు మన వంటింట్లో ఉండే ముఖ్యమైన మసాలాల్లో ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో మిరియాల చారు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు గరగర వంటి సమస్యల్లో ఉపశమనం కలగవచ్చని చెబుతారు. మిరియాల్లోని పైపెరిన్‌తో పాటు పలు పోషకాలు, యాంటీఆక్సిడెంట్‌ సమ్మేళనాలు ఉంటాయి. ఆహారంలో మితంగా మిరియాల పొడి చేర్చుకోవడం జీర్ణక్రియకు తోడ్పడవచ్చు. అయితే అధికంగా తీసుకుంటే కడుపులో మంట లేదా అసౌకర్యం కలిగే అవకాశం ఉండటంతో పరిమితంగా తీసుకోవడం మంచిది.

పాతకాలం నాటి నల్ల బంగారం.. మిరియాల రసం ఇలా తాగరంటే జలుబు, దగ్గు దెబ్బకు పరార్..
Miriyala Rasam Benefits
Shaik Madar Saheb
|

Updated on: Aug 28, 2026 | 6:01 PM

Share

పూర్వం మిరపకాయల వినియోగం లేని రోజుల్లో, కారం రుచిని అందించింది మిరియాలే.. పురాణాలలో, శాస్త్రాలలో కూడా మిరియాల ప్రస్తావన ఉండటం, ఆయుర్వేదంలో దీని ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు మిరియాలు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. వాతావరణ మార్పులు లేదా వర్షంలో తడవడం వల్ల తలెత్తే ఈ చిన్నపాటి అనారోగ్యాలకు మిరియాల రసం ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. నల్ల మిరియాలలో విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ ఎ, బి విటమిన్లు (బి1, బి2, బి5, బి6, నియాసిన్, ఫోలేట్) తోపాటు.. ఖనిజాలు.. పొటాషియం, ఇనుము (ఐరన్), మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ ఉన్నాయి.. ఫైబర్ తగిన మోతాదులో ఉండటంతోపాటు.. మిరియాలకు ఘాటును తెచ్చే ముఖ్యమైన సమ్మేళనం పైపెరిన్ (Piperine) కూడా పుష్కలంగా ఉంటుంది..

మిరియాల రసాన్ని అన్నంతో కలిపి తీసుకున్నా, లేదా గ్లాసులో పోసుకుని తాగినా గొంతు గరగర, జలుబు, దగ్గు నిమిషాల్లో మాయమవుతాయి. వారంలో కనీసం ఒక్కసారైనా మిరియాల చారు సేవించడం వల్ల పొట్టలో జీర్ణం కాకుండా మిగిలిపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎన్ని మందులు వాడినా తగ్గని పొట్ట బరువు సమస్య మిరియాల చారుతో తేలికపడుతుంది.

ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే..

అంతేకాకుండా, మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే వంటల్లో కాస్త మిరియాల పొడిని వాడటం మంచిది. అయితే, దీనిని అధిక మోతాదులో వాడితే కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మిరియాలలో పైపెరిన్, పైపెరిడిన్, పైపిరిటిన్, కెవాసిన్ వంటి ఆల్కలాయిడ్లు ఉంటాయి.

ఇవే మిరియాలకు చేదు, ఘాటు రుచిని ఇస్తాయి. వీటితో పాటు మిరియాలలో తైలం, కొవ్వు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, భాస్వరం, థయామిన్, రిబోఫ్లేవిన్, నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

అందుకే.. మిరియాలు వాతాన్ని, కఫాన్ని అణచివేసి, జీర్ణశక్తిని పెంచుతాయని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. బ్రాంకైటిస్, మూత్ర సంబంధిత సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అయితే.. మిరియాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి.. ఏమైనా సమస్యలుంటే, ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నల్ల బంగారం.. అనారోగ్య సమస్యలన్నీ పరార్..
నల్ల బంగారం.. అనారోగ్య సమస్యలన్నీ పరార్..
సెప్టెంబర్‌లో వారికి కెరీర్, వ్యాపారంలో భారీ లాభాలు!
సెప్టెంబర్‌లో వారికి కెరీర్, వ్యాపారంలో భారీ లాభాలు!
మనసులో ద్వేషానికి తాతయ్య చెప్పిన గుణపాఠం.. కుళ్లిన బంగాళాదుంపల కథ
మనసులో ద్వేషానికి తాతయ్య చెప్పిన గుణపాఠం.. కుళ్లిన బంగాళాదుంపల కథ
'చేతులతో కోటనే కదిలించారు' జపాన్‌లో భవనాన్ని జరిపిన ప్రజలు
'చేతులతో కోటనే కదిలించారు' జపాన్‌లో భవనాన్ని జరిపిన ప్రజలు
మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్..
మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్..
ప్రకృతిలో విరబూసిన రాఖీ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
ప్రకృతిలో విరబూసిన రాఖీ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.