AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Bill: మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్ పనితో ఈజీగా పసిగట్టొచ్చు.. మీ అనుమానాలన్నీ క్లియర్..

కరెంట్ తక్కువగా వాడినా బిల్లు ఎక్కువగా వచ్చిందని చాలామంది అనుమానపడుతుంటారు. ఎలా తెలుసుకోవాలో తెలియక లోలోపల సతమతమవుతుంటారు. అలాంటివారు సింపుల్ పనితో ఈజీగా గుర్తుపట్టవచ్చు. మీ కరెంట్ బిల్లు కరెక్ట్‌గా వచ్చిందా.. లేదా తప్పుగా వచ్చిందా అనేది పసిగట్టవచ్చు. ఆ ట్రిక్స్ ఏంటనేది చూద్దాం.

Power Bill: మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్ పనితో ఈజీగా పసిగట్టొచ్చు.. మీ అనుమానాలన్నీ క్లియర్..
Power Bill
Venkatrao Lella
|

Updated on: Aug 28, 2026 | 5:18 PM

Share

ప్రతీఒక్కరి ఇంట్లో విద్యుత్ కనెక్షన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇంటికి కావాల్సిన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నా.. అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో విద్యుత్ కనెక్షన్ ప్రతీఒక్కరూ వినియోగిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీరు ఇంట్లో కరెంట్ తక్కువగా వాడినా బిల్లు ఎక్కువగా వచ్చిందని, తప్పుగా పడిందేమోనని అనుమానపడుతుంటారు. ఎలా కనిపెట్టాలో తెలియక సతమతమవుతుంటారు. ఇలాంటప్పుడు మీరు చిన్న ట్రిక్స్‌తో మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందా..? లేదా కరెక్ట్‌గానే వచ్చిందా? అనేది గుర్తించవచ్చు. అదెలా అనేది ఇందులో చూద్దాం.

మీటర్ రీడింగ్ చెక్ చేయండి

మీకు వచ్చిన కరెంట్ బిల్లులో మీటర్ రీడింగ్ నమోదు చేసి ఉంటుంది. గత నెలలో ఎంత విద్యుత్ వినియోగించారనే వివరాలతో పాటు పెండింగ్ బిల్లు, ఇతర ఛార్జీలు, ఆలస్యపు ఫీజులు వంటి వివరాలు ఉంటాయి. ఒకసారి కరెంట్ బిల్లులో ఉన్న రీడింగ్‌తో ప్రస్తుతం మీ మీటర్ రీడింగ్‌ను పోల్చి చూడండి. రెండు రీడింగ్స్ అటుఇటుగా ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. మీ బిల్లులోని మీటర్ రీడింగ్ నెంబర్లకు, ప్రస్తుత ఉన్న మీటర్ రీడింగ్ నెంబర్లకు మధ్య పోంతన లేకపోతే జాగ్రత్త పడాల్సిందే.  ఒకేలా ఉంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం  ఉండదు. ఇక గత నెలలో ఆలస్యంగా బిల్లు చెల్లించి ఉండి ఈ నెల బిల్లులో అది అప్డేట్ కాకుండా మళ్లీ చూపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఇక కొన్నిసార్లు డొమెస్టిక్ కనెక్షన్‌కు బదులు కమర్షియల్ కేటగిరీ కింద బిల్లు పడవచ్చు. వీటన్నింటిని ప్రతీ నెలా మీ బిల్లులో చెక్ చేయాలి. వీటిని గమనించాక ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలి.

ఎలా ఫిర్యాదు చేయాలి?

మీటర్ రీడింగ్‌లో ఏమైనా తేడాలంటే మీ కరెంట్ బిల్లు, మీ కరెంట్ మీటర్ రీడింగ్ స్క్రీన్‌పై కనిపించే నెంబర్లను ఫొటో తీసుకుని మీ ప్రాంత పరిధిలోని సబ్ స్టేషన్‌కు వెళ్లాలి. అలాగే ఏఈ లేదా ఈఆర్వో ఆఫీస్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయండి. ఆఫీస్‌కు వెళ్లలేకపోతే మీ కరెంట్ బిల్లుపై ఉండే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంద మీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని అనుమానపడేవారు ఈ విధానాల ద్వారా మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. చాలామందికి ఈ విషయాలు తెలియక అనుమానం రాగానే విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళుతుంటారు.

Follow Us