Bitter Gourd Juice: జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? అయితే ఇది ట్రై చేసి చూడండి..
కాకరకాయ ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఇంట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు. కానీ రుచి చేదుగా ఉంటుంది కాబట్టి, దీనిని తినడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ మీకు తెలుసా? కాకరకాయ జుట్టు, చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో కూడా బలేగా ఉపయోగపడుతుంది. కాకరకాయ రసం ఈ సమ్యలన్నింటికీ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది..

కాకరకాయ రసంలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహం, మలబద్ధకం, జలుబు, ఉబ్బసం, కడుపు వ్యాధులతో సహా వివిధ శారీరక సమస్యలను సులభంగా పరిష్కరిస్తుంది. అయితే కాకరకాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంపై మొటిమలను శాశ్వతంగా నివారించవచ్చు. కాకరకాయ రసం మొటిమల మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. నిజానికి, కాకరకాయ రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండటానికి బలేగా ఉపయోగపడుతుంది.
కాకరకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో త్రాగాలి. రుచి కోసం అందులో కొంచెం తేనె జోడించవచ్చు. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఈ రసం పొడి చర్మ సమస్యలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కాకరకాయ రసాన్ని ఒక కంటైనర్‌లో తీసుకుని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. మధ్యాహ్నం బయటి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, కాకరకాయ రసంలో దూదిని ముంచి, దానితో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు తొలగిపోతాయి.
ఎండలో కమిలిపోయిన చర్మానికి కాంతిని పునరుద్ధరించడానికి కాకరకాయ రసం గొప్పగా పనిచేస్తుంది. బయటి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ముఖానికి కాకరకాయ రసాన్ని రాసుకుని 5 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి కనీసం మూడు సార్లు చేయాలి. నల్లటి చర్మం త్వరగా మాయమై మామూలు స్థితికి వస్తుంది. కానీ చర్మానికి మాత్రమే కాదు. ఇది జుట్టు సమస్యలను తొలగించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా చుండ్రుతో బాధపడేవారు వారానికి కనీసం 3 రోజులు కాకరకాయ రసాన్ని తలకు రాసుకుని మసాజ్ చేసుకోవాలి. అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం లేదా జుట్టు రాలడం ఉంటే, వారానికి మూడు సార్లు కాకరకాయ రసంలో నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేసుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.








