Seasonal Fruits benefits: సీజనల్‌గా దొరికే ఈ పండ్లను తింటే అధిక బరువు సమస్య ఫసక్.. మెరుగైన రోగనిరోధక శక్తి మన సొంతం

బరువు నిర్వహణకు వర్క్‌అవుట్స్ ఎంత ముఖ్యమో? మంచి ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లతో పాటు ఆకు కూరలు తీసుకుంటే మేలని సూచిస్తున్నారు.

Seasonal Fruits benefits: సీజనల్‌గా దొరికే ఈ పండ్లను తింటే అధిక బరువు సమస్య ఫసక్.. మెరుగైన రోగనిరోధక శక్తి మన సొంతం
Spring season fruits
Follow us
Srinu

|

Updated on: Feb 16, 2023 | 10:35 AM

ప్రస్తుతం చలికాలం చివరి దశలో వేసవి కాలం ప్రారంభదశలో ఉన్నాం. చలికాలంలో ముఖ్యంగా వ్యాయామానికి వెళ్లడానికి బద్దకిస్తూ అధిక బరువు సమస్యతో బాధపడుతుంటాం. అయితే ఈ బరువును రానున్న వేసవిలో ఎలా తగ్గించాలో? అని ప్రణాళికలు వేస్తుంటాం. అయితే పోషకాహార నిపుణులు మాత్రం బరువు నిర్వహణకు వర్క్‌అవుట్స్ ఎంత ముఖ్యమో? మంచి ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లతో పాటు ఆకు కూరలు తీసుకుంటే మేలని సూచిస్తున్నారు. సీజనల్ పండ్లల్లో ఉండే అధిక పోషకాలు బరువు నిర్వహణలో సాయం చేస్తాయని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే సీజనల్ పండ్లు ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవు కాబట్టి అందులో శరీరానికి అవసరమయ్యే పోషకాలను కోల్పోకుండా ఉంటుంది. ప్రస్తుత కాలంలో దొరికే ఏ సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందో? ఓ సారి తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు వేసవి కాలంలో మంచి పోషకాహారంగా పని చేస్తాయి. వీటిని తరచూ తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల లక్షణాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి బరువు నిర్వహణలో అద్భుతంగా సాయం చేస్తాయి.

చెర్రీస్

చెర్రీస్‌లో క్యాలరీలు తక్కువగా ఉండడంతో శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు సీ,ఏ,కె వంటివి అధికంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి శరీరానికి అందుతాయి. బీటా కెరోటిన్, కోలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. చెర్రీలను తింటే మనస్సు రిలాక్స్ అవ్వడమే కాక నిద్ర సంబంధిత రుగ్మతలను తొలగించడంలో సాయం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను, యూరిన్‌లో యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

నారింజ

వేసవి కాలం ప్రారంభంలో దొరికే నారింజ వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నారింజ శరీరంలో కణాలను దెబ్బతినకుండా కాపాడడంతో పాటు, కొల్లాజిన్ తయారు చేయడంలో సాయం చేస్తాయి. నారింజ ముఖ్యంగా గాయాలను నయం చేసి, మృదువైన చర్మాన్ని అందిస్తుంది. ఐరన్‌ను శరీరంలో సులభంగా సంగ్రహించేలా చేస్తూ రోగనిరోధక శక్తి మెరుగుదలకు సాయపడుతుంది. ముఖ్యంగా నారింజ సూక్ష్మ క్రిముల నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బ్లాక్‌బెర్రీస్

బ్లాక్బెర్రీస్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి సి, కె, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉండడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో సాయం చేస్తాయి. వాటిలో అధిక మొత్తంలో విటమిన్లు, ఫైబర్, తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మధుమేహాన్ని నియంత్రించి, జీవక్రియను వేగవంతం చేస్తాయి.

బొప్పాయి

బొప్పాయిలో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, ఈ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తాయి. బొప్పాయిలు జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడతాయి. ఇవి బరువు తగ్గడాన్ని మరింత వేగవంతం చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..