Food Identification: మీ ఇంట్లోని తేనె అస‌లైందేనా.. క‌ల్తీనా.. ఇలా ఈజీగా తెలుసుకోండి..

తేనె వ‌ల్ల మ‌న‌కు అనేక ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని నిత్యం వాడ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ స‌మస్యలు ఉండ‌వు. ఇంకా అనేక ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. అయితే మార్కెట్‌లో మ‌న‌కు ల‌భించే తేనెల్లో కల్తీనా.. కాదా ఇలా తెలుసుకోండి..

Food Identification: మీ ఇంట్లోని తేనె అస‌లైందేనా.. క‌ల్తీనా.. ఇలా ఈజీగా తెలుసుకోండి..
Honey
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 16, 2023 | 10:08 AM

ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. ఇలా కృత్రిమంగా జరిగే పదతి అంటే వారు ఈ తేనెటీగల పెంపకంతో కాదు. తేనె సేకరణ వల్ల తేనెపట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. అయితే ఈ కల్తీ తేనెను గుర్తించడం చాలా పెద్ద సమస్యగా మారుతోంది. ఎందుకంటే ప్రకృతి అందించే ఈ తేనెను కల్తీతో ప్రాణాలకు హానిగా మార్చేస్తున్నారు.

చాలా కంపెనీలకు చెందిన ఫ్లేవర్డ్ తేనె మార్కెట్లో లభ్యమవుతుంది. అయితే ఇది నిజంగా నిజమైనదేనా అనేది  అతిపెద్ద ప్రశ్న. అయితే, ఈ గందరగోళాన్ని చెక్ పెట్టాలంటే తేనెను చెక్ చేయడం మంచిది. ఎందుకంటే నకిలీ తేనె ఆరోగ్యంపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. తేనె స్వచ్ఛతను తెలుసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. దీని సమాచారం ఈ కథనంలో తేలిపోతుంది.

నీటితో పరీక్షించవచ్చు..

చాలా సహజమైన ఆహార ఉత్పత్తుల వాస్తవికతను తనిఖీ చేయడం చాలా సులభం. మీరు వాటిని నీటిలో వేసి చూడండి. తేనె స్వచ్ఛతను తనిఖీ చేయడానికి మీరు ఈ ట్రిక్‌ను ప్రయత్నించవచ్చు. తేనె త్వ‌ర‌గా కరిగిపోతే అది న‌కిలీద‌ని గుర్తించండి. స్వ‌చ్ఛ‌మైన తేనెను నీటిలో వేయ‌గానే గ్లాస్ అడుగు భాగంలోకి చేరి కొంత సేపు వ‌ర‌కు అలాగే ఉంటుంది. ఇలా స్వ‌చ్ఛ‌మైన తేనెను గుర్తించ‌వ‌చ్చు. తేనె కరిగిపోవడం లేదా నీటిలో తేలితే అది కల్తీ తేనె కావచ్చు. ఇది తినడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

తెలుపు రంగు వ‌స్త్రంపై..

బ్లోటింగ్ పేప‌ర్ లేదా తెలుపు రంగు వ‌స్త్రంపై చిన్న తేనె చుక్కను వేసి కూడా పరీక్షించవచ్చు. స్వచ్ఛమైన తేనె తెలుపు రంగు వస్త్రం తేనెను లోపలికి పీల్చుకోదు. అలాగే మ‌ర‌క‌లు కూడా ప‌డ‌వు. న‌కిలీ తేనె అయితే సుల‌భంగా మ‌ర‌క‌లు ప‌డ‌తాయి. లోప‌లికి పీల్చుకుంటుంది.

పత్తితో పరీక్షించండి

అవును, తేనె స్వచ్ఛతను తెలుసుకోవడానికి మీరు పత్తిని కూడా ఉపయోగించవచ్చు. చెక్క లేదా అగ్గిపెట్టెపై పత్తిని సరిగ్గా చుట్టండి. ఇప్పుడు దూదిని తేనెలో ముంచి, కొంత సమయం తర్వాత కొవ్వొత్తి సహాయంతో కాల్చండి. దూది మంటల్లో కాలిపోతే ఆ తేనె నిజమేనని అర్థం చేసుకోండి. పత్తికి మంటలు అంటుకోకపోతే ఈ తేనె నకిలీ కావచ్చు.

ఇలా కూడా చేయవచ్చు..

వేలిపై చిన్న తేనె తేనె చుక్క‌ను వేసి చూడండి. న‌కిలీ తేనె అయితే సుల‌భంగా అటు, ఇటు నీళ్లు వెళ్లిన‌ట్లు వెళ్తుంది. అదే స్వ‌చ్ఛ‌మైన తేనె అయితే ఆ చుక్క క‌ద‌ల‌కుండా అలాగే ఉంటుంది. ఇలా న‌కిలీ తేనెను క‌నిపెట్ట‌వ‌చ్చు.

మండే స్వభావం..

కల్తీ లేని తేనె మండుతుంది. అంటే.. మండే స్వభావాన్ని కల్తీ లేని తెనె క‌లిగి ఉంటుంది. ఒక అగ్గిపుల్ల‌ను తేనెలో ముంచి దాన్ని పెట్టెకు రాపిడి క‌లిగించాలి. స్వ‌చ్ఛ‌మైన తేనె అయితే అగ్గిపుల్ల మండుతుంది. అదే క‌ల్తీ తేనె అయితే అగ్గిపుల్ల మండ‌దు. ఈ సూచను పాటించేట‌ప్పుడు మంట‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలని సూచిస్తున్నాం..

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్