Muscle Exercises: ఇంట్లో ఉంటూనే కండలు తిరిగిన శరీరం కావాలా? ఈ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే సరి..
కండలు తిరిగిన శరీరం కావాలంటే మాత్రం కచ్చితంగా జిమ్‌కు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లోనూ ఉంటే కొన్ని రకాల వ్యాయామాలు అధికంగా చేస్తే కచ్చితంగా కండలు తిరిగిన శరీరం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కండరాల ద్రవ్యరాశిని నిర్వహించడానికి భారీ జిమ్ ఎక్విప్‌మెంట్ లేకపోయినా కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన శరీరంపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడం అన్ని సమయాల్లో సాధ్యం కాకపోవచ్చు. అలాగే పెరుగుతున్న పని ఒత్తిడి వల్ల జిమ్‌లో ఎక్సరసైజ్‌లు చేయడానికి సమయం కుదరకపోవచ్చు. అందువల్ల ఇంట్లోనే చాలా మంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ కండలు తిరిగిన శరీరం కావాలంటే మాత్రం కచ్చితంగా జిమ్‌కు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లోనూ ఉంటే కొన్ని రకాల వ్యాయామాలు అధికంగా చేస్తే కచ్చితంగా కండలు తిరిగిన శరీరం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కండరాల ద్రవ్యరాశిని నిర్వహించడానికి భారీ జిమ్ ఎక్విప్‌మెంట్ లేకపోయినా కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వయస్సు పెరిగే సమయంలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ కండరాల ద్రవ్యరాశిని కోల్పోతూ ఉంటారు. కాబట్టి పెరిగిన వయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్ల వయస్సు దాటినప్పుడు 7 శాతం చొప్పున శరీరం కండర ద్రవ్యరాశిని కోల్పోతుంది. ఇదే అరవై ఏళ్ల వయస్సు వచ్చే సరికి 15 శాతం వరకూ పెరుగుతుంది. కాబట్టి వయస్సు పెరిగే సమయంలో చురుగ్గా ఉండడానికి యుక్త వయస్సు నుంచే మంచి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా కండలు తిరిగిన శరీరం కోసం ఇంట్లోనే ఉంటూ ఇక్కడ దొరికే వస్తువులతో సరదా వ్యాయామమం చేస్తే సరిపోతుందని జిమ్ ట్రైన్లు చెబుతున్నారు. వారు చెప్పే ఆ సూచనలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
లేట్రల్ లెగ్ ఎక్సరసైజ్
కాలి బోటన వేలుపై బరువంతా పడేలా ఐదు సార్లు బాడీని లిఫ్ట్ చేయాలి. తర్వాత బొటన వేలు పైకప్పును చూసేలా మరో ఐదు సార్లు చేయాలి. ఇవి మాస్ కండరాన్ని నిర్మించడంలో సాయం చేసే కోర్‌తో పాటు బాడీ వ్యాయామాలుగా ఉంటాయి.
వాటర్ క్యాన్ కర్ల్స్
ప్రతి చేతిలో ఐదు లీటర్ల వాటర్ క్యాన్‌ను పట్టుకుని మీ అరచేతులు లోపలికి ఎదురుగా ఉండేలా వాటర్ బాటిళ్లను మీ భుజాల వైపుకు ముడుచుకోవాలి. ఈ వ్యాయామం మీ ముంజేతుల కండరపుష్టిని పెంచుతుంది.
వాటర్ క్యాన్ షోల్డర్ ఓవర్ హెడ్స్
మీ పాదాలను భుజం వెడల్పుతో దూరంగా ఉంచి, ప్రతి చేతిలో 5 లీటర్ల వాటర్ క్యాన్ పట్టుకోండి. వాటర్ క్యాన్‌ను పైకి లేపి, వాటిని పైకి తీసుకెళ్లండి. కొన్ని సెకన్ల పాటు ఆపుతూ చేస్తూ ఉండాలి. అనంతరం మీ చేతులను కిందకు తీసుకురావాలి. ఈ వ్యాయామం మీ మొత్తం ట్రైసెప్స్, భుజాలపై పని చేస్తుంది.
పెల్విక్ ఎక్సర్‌సైజ్
మీ వీపుపై నేలపై పడుకుని, ఆపై తుంటిని పైకి ఎత్తాలి. అనంతరం మీరు ప్రతి స్క్వీజ్‌ను కొన్ని సెకన్ల పాటు పట్టుకుని, ఆపై దాన్ని విడుదల చేయాలి. ఇది మీ పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది అలాగే మీ ప్రేగు, మూత్రాశయ నియంత్రణను మరింత మెరుగుపరుస్తుంది.
స్పాట్ వాకింగ్
అక్కడికక్కడే నడుస్తున్నప్పుడు, మీ మోకాలిని తుంటి స్థాయి వరకు పెంచాలి. అలాగే ఆరుబయట నడిచేటప్పుడు మీ చేతులను స్వింగ్ చేస్తూ వ్యాయామం చేయాలి. అక్కడికక్కడే నడవడం చాలా సులభంగా ఉంటుంది. అలాగే దీన్ని సమర్థవంతమైన వ్యాయామం అని అంటారు. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇలా చేస్తే మీ కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే మీ కాలు కండరాల బలం పెంచుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







