Sore Throat Problems: గొంతులో కిచ్…కిచ్…. యాపిల్ సైడర్ వెనిగర్‌తో కిచ్..కిచ్‌కు చెప్పండి గుడ్ బై..
యాపిల్ సైడర్ వెనిగర్‌తో గొంతు సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా తరచూ వేధించే దగ్గు, జలుబు వంటి వ్యాధుల చికిత్స కోసం ఇంటి నివారణ మార్గంలో చెక్ పెట్టవచ్చు. పిండిచేసిన యాపిల్స్‌ను పులియబెట్టి, వడకట్టని రసం నుంచి ఈ యాపిల్ సైడర్ వెనిగర్‌ను తయారు చేస్తారు.

ప్రస్తుతం వాతావరణం చలికాలం నుంచి వేసవి కాలానికి మారుతుంది. ఉదయమంతా ఎండలు మండతుంటే రాత్రి సమయంలో చలి కుమ్మేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని సీజనల్‌గా వచ్చే వ్యాధులు వేధించే సమస్య ఉంది. ముఖ్యంగా గొంతు సంబంధిత సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఎన్ని మందులు వాడినా మళ్లీ మళ్లీ అదే ఇబ్బంది వల్ల చిరాకు వస్తుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో గొంతు సంబంధిత సమస్యలకు గుడ్‌బై చెప్పవచ్చు అని మీకు తెలుసా? ముఖ్యంగా యాపిల్ సైడర్ వెనిగర్‌తో గొంతు సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా తరచూ వేధించే దగ్గు, జలుబు వంటి వ్యాధుల చికిత్స కోసం ఇంటి నివారణ మార్గంలో చెక్ పెట్టవచ్చు. పిండిచేసిన యాపిల్స్‌ను పులియబెట్టి, వడకట్టని రసం నుంచి ఈ యాపిల్ సైడర్ వెనిగర్‌ను తయారు చేస్తారు. ఇది గొంతు నొప్పి లక్షణాలను నియంత్రిస్తుంది. అలాగే అనేక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సాయం చేస్తుంది. యాంటీమైక్రోబయల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల యాపిల్ సైడర్ వెనిగర్ మీకు ఉపశమనం కలిగించి, అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను కొన్ని పదార్థాలతో కలుపుకుని సేవిస్తే గొంతు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
యాపిల్ సైడర్ వెనిగర్, తేనె
గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలను చికిత్స చేయడంలో ఈ మిశ్రమం మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఓ పాత్రలో వేడి నీటిని మరిగించి ఓ గ్లాసులో పోసి అందులో ఓ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను రెండు స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. తాగేందుకు వీలుగా ఉన్న వేడితో ఈ మిశ్రమాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనగర్, బేకింగ్ సోడా
సీజనల్‌గా వచ్చే గొంతు నొప్పి, దగ్గు నుంచి రక్షణ కోసం ఈ చిట్కా పాటించాలి. ముందుగా ఓ గ్లాసు నీటిని వేడి చేసి ఓ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఇంకో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి, గొంతు ఇన్‌ఫెక్షన్, జలుబు, దగ్గు నుంచి రక్షణ కోసం ఈ మిశ్రమాన్ని నోటిలో వేసుకుని పుక్కిలించాలి. కనీసం వారానికి రెండు నుంచి మూడు రోజుల పాటు రోజుకు మూడుసార్లు ఇలా పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.



యాపిల్ సైడర్ వెనిగర్, దాల్చిన చెక్క
ముందుగా ఓ కప్పు వేడి నీళ్లల్లో ఓ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా సిప్ చేయాలి. దీన్ని సిప్ చేయలేకపోతే నోట్లో వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు చేయాలి.
యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ
ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఓ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఓ టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా సిప్ చేయాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
యాపిల్ సైడర్ వెనిగర్, ఉప్పు నీరు
ఓ గిన్నెలో నీటిని మరిగింంచి కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్, 1-2 టేబుల్ స్పూన్ల ఉప్పును కలపాలి. గొంతు నొప్పి నుంచి ఉపశమనం కోసం రోజుకు 20-30 సార్లు ఈ మిశ్రమాన్ని పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేయడం ద్వారా గొంతు ఇన్‌ఫెక్షన్ల నుంచి వెంటనే రక్షణ పొందవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..