Apple Cider vinegar: దంతాలు తెల్లగా మారాలా? ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి చాలు.. కానీ జాగ్రత్త అవసరం సుమా!
యాపిల్ సైడర్ వెనిగర్‌లో దీనిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ , కాపర్, మాంగనీస్ వంటి మినరల్స్ ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిలో ఎన్ని ప్రయోజనాలున్నా మితంగానే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా వాడితే అధికమైన సైడ్ ఎఫెక్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు.

యాపిల్ సైడర్ వెనిగర్.. చాలా ఏళ్లుగా మంచి ఇంటి చిట్కాగా దీనిని ఉపయోగిస్తున్నారు. దీన్ని యాపిల్ రసంతో తయారు చేస్తారు. యాపిల్ సైడర్ వెనిగర్ వంట రుచిని పెంచడంతోపాటు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మంది చెబుతుంటారు. అది కొంత వరకూ నిజమే. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ , కాపర్, మాంగనీస్ వంటి మినరల్స్ ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిలో ఎన్ని ప్రయోజనాలున్నా మితంగానే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా వాడితే అధికమైన సైడ్ ఎఫెక్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు.
బహుళ ప్రయోజనాలు..
ప్రతి రోజూ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది, బరువును నియంత్రిస్తుంది, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పి కూడా తగ్గిస్తుంది. అంతేకాక చర్మం, జుట్టుని కూడా చక్కగా సంరక్షిస్తుంది.
దంత సమస్యలకు చెక్..
చాలా మంది ఎదుర్కొనే సమస్య దంతాలు పసుపు రంగులో ఉండటం. ఎంత శ్రద్ధగా బ్రష్ చేసినప్పటికీ చాలా మందిలో పళ్లు పసుపు రంగులో కనిపిస్తాయి. వాటిని తెలుపు రంగులోకి తీసుకురావడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ దీని బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.



ఏం చేయాలంటే..
కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని నీటిలో కలపాలి. తర్వాత దాన్ని నోటిలో వేసుకొని బాగా పుక్కిలించాలి. రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడంతోపాటు ఇతర దంత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపే ముందు దాన్ని బాగా షేక్ చేయాలి. ఈ వెనిగర్‌ను కచ్చితంగా నీటిలో కలిపిన తర్వాతే పుక్కిలించాలి. లేకపోతే దానిలోని ఆమ్లతత్వం వల్ల పంటిపై ఉన్న ఎనామిల్ పొరకు నష్టం వాటిల్లుతుంది. రోజుకు ఒకసారి కంటే ఎక్కువ చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పంటి సెన్సిటివిటీ ఉన్న వారు కూడా దీనిని వినియోగించకూడదు. వైద్యల సూచనల మేరకు గత ఆరోగ్య రికార్డుల ఆధారంగా దీనిని వినియోగిస్తే మేలు..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..