Honey Benefits: పెదవులపై తేనెను పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తేనె.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే పరిశోధకులు నిరూపించారు. తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఔషధ గుణాలు అంతా ఇంతా కాదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు తేనెతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.ప్రజలు తమ పెదాలను అందంగా, గులాబీ రంగులో మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.

Honey Benefits: పెదవులపై తేనెను పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Honey Benefits
Follow us

|

Updated on: May 12, 2024 | 7:43 PM

తేనె.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే పరిశోధకులు నిరూపించారు. తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఔషధ గుణాలు అంతా ఇంతా కాదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు తేనెతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.ప్రజలు తమ పెదాలను అందంగా, గులాబీ రంగులో మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇప్పటికీ వారు ఉపశమనం పొందలేరు. మీరు కూడా మీ పెదాల నలుపుతో ఇబ్బంది పడుతుంటే ఈ హోం రెమెడీని ప్రయత్నించడం ద్వారా మీరు మీ పెదాలను పింక్, అందంగా మార్చుకోవచ్చు.

తేనెలో ఔషధ గుణాలు

తేనెలో తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది పగిలిన, నల్లని పెదాలకు తేమను అందిస్తుంది. అంతే కాదు తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వాపు, చికాకును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది కాలిన పెదవులు, గాయాలను త్వరగా తగ్గిస్తుంది.

నల్లటి పెదవులకు చికిత్స

తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి పెదాలను రక్షించడంలో, నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. మీ పెదవులు నల్లగా లేదా పగుళ్లుగా మారినట్లయితే, మీరు తేనెను ఉపయోగించి మీ పెదాలను స్క్రబ్ చేయవచ్చు. దీని కోసం మీరు తేనెలో కొంత చక్కెరను మిక్స్ చేయాలి. తర్వాత పెదాలపై మృదువుగా మసాజ్ చేయాలి.

పొడిబారకుండా ఉండేందుకు..

పెదవులపై చికాకును తగ్గించడంలో తేనె చాలా సహాయపడుతుంది. అలాగే పెదలు పొడిగా ఉంటే దానిని తొలగించి పెదాలను హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది పెదాలను ప్రకాశవంతంగా చేస్తుంది. పెదాలపై మాయిశ్చరైజర్‌ను నిర్వహించడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి తేనె దివ్యౌషధంగా పరిగణించబడుతుంది.

తేనెను ఇలా వాడండి:

తేనెను నేరుగా పెదాలపై అప్లై చేస్తే లిప్ బామ్‌లా పనిచేస్తుంది. ఇది కాకుండా వేడి నీటిలో 1 చెంచా తేనె కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేసి, అందులో దూదిని నానబెట్టి, పెదవులపై కొన్ని నిమిషాల పాటు ఉంచండి. నిద్రపోయే ముందు, పెదవులపై పలుచని తేనెను రాసి, రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం కడిగేయండి. కొందరికి దీని వల్ల అలెర్జీ ఉండవచ్చని గుర్తుంచుకోండి. ఇది జరిగితే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..