AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..!

శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడే డ్రైఫ్రూట్స్‌ని ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సూపర్‌ఫుడ్‌లలో ఒకటి ఖర్జూరం. శీతాకాలంలో ఎండు ఖర్జూరం, పాలు కలిపి రాత్రి తీసుకుంటే లెక్కలేనన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..!
Milk With Dates
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2025 | 7:05 PM

Share

చలికాలం మొదలైందంటే మార్కెట్ నిండా రకరకాల పండ్లు, కూరగాయలు విస్తృతంగా కనిపిస్తాయి. సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ప్రజలు అన్ని రకాల పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్‌ని మన ఆహారంలో చేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఆయుర్వేదం ప్రకారం ఈ సీజన్‌లో జఠరాగ్ని చాలా బలంగా ఉంటుంది. దీని వలన బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అందువల్ల శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడే డ్రైఫ్రూట్స్‌ని ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సూపర్‌ఫుడ్‌లలో ఒకటి ఖర్జూరం. శీతాకాలంలో ఎండు ఖర్జూరం, పాలు కలిపి రాత్రి తీసుకుంటే లెక్కలేనన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం…

చిన్నగా కనిపించే ఖర్జూరం రుచిలో చాలా తియ్యగా ఉంటుంది. శక్తి, పోషకాలు, ఔషధ గుణాలకు నిలయం. ఆయుర్వేదంలో ఖర్జూరాలు ఒక టానిక్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే అవి శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, శక్తిని అందించడానికి, బలహీనతను దూరం చేయడానికి సహాయపడతాయి. శీతాకాలంలో ఖర్జూరం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఖర్జూరం తినడం గుండెకు మేలు చేస్తుంది. ఖర్జూరంలో పొటాషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. అవి గుండె సరిగ్గా పనిచేయడానికి సహాయపడటం వలన అధిక రక్తపోటును కూడా నివారిస్తాయి. చిన్న ఖర్జూరం మెదడుకు కూడా మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల నరాలు బలపడతాయి. వాటిలో ఉండే మెగ్నీషియం, భాస్వరం మెదడు ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ ఖర్జూరాన్ని తినవచ్చు. ఇది బలహీనత, అలసటను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఖర్జూరాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వృద్ధులకు, ఖర్జూరాన్ని తినడం అమృతం లాంటిది. కావాలనుకుంటే, ఖర్జూరాన్ని రుబ్బి పాలలో మరిగించి వృద్ధులకు కూడా ఇవ్వవచ్చు. ఇది ఆర్థరైటిస్ నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది చర్, జుట్టుకు, రక్త శుద్ధికి, పాలిచ్చే మహిళలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎలా తినాలి :

దీనికోసం 2 నుంచి 3 ఎండు ఖర్జూరాలు, ఒక గ్లాసు పాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు, ఒక పాత్రలో పాలు మరిగించుకోవాలి. ఈ పాలలో ఖర్జూరాలు కూడా వేసి మరిగించాలి. పాలు కొద్దిగా చిక్కగా, ఖర్జూరాలు మెత్తబడిన తర్వాత తాగేయొచ్చు. రాత్రిపూట ఈ పాలు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఖర్జూరాలతో పాటు పాలలో మఖానా కూడా వేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us