Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnant Women: ప్రెగ్నెన్సీ టైంలో మీరూ బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా..

ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు తెలిసీ తెలియక చేసే కొన్ని పొరబాట్లు లేనిపోని చిక్కుల్లో పడేస్తాయి. అందుకే గర్భధారణ సమయంలో అదనపు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో కూడా ఇతర రోజుల మాదిరిగా ఉండటం సాధ్యం కాదు. ఈ రోజుల్లో శరీరం ప్రతిదానికీ స్పందించదు..

Pregnant Women: ప్రెగ్నెన్సీ టైంలో మీరూ బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా..
Pregnancy
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2025 | 7:37 PM

తల్లి అవడం ప్రతి మహిళకు ఓ తీపి అనుభవం. కానీ ఈ సమయంలో గర్భిణీలు తెలిసీ తెలియక చేసే కొన్ని పొరబాట్లు లేనిపోని చిక్కుల్లో పడేస్తాయి. అందుకే గర్భధారణ సమయంలో అదనపు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో కూడా ఇతర రోజుల మాదిరిగా ఉండటం సాధ్యం కాదు. ఈ రోజుల్లో శరీరం ప్రతిదానికీ స్పందించదు. కాబట్టి మీరు ఏ రకమైన పని చేయాల్సి వచ్చినా, ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మహిళలు అందం పట్ల అంత ఎక్కువ శ్రద్ధ చూపకపోవడమే బెటర్‌. కొంతమంది ప్రెగ్నెన్సీ సమయంలో బ్యూటీ పార్లర్‌లను అధికంగా సందర్శిస్తారు. కానీ గర్భధారణ సమయంలో బ్యూటీ పార్లర్‌లకు వెళ్లేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. బ్యూటీ పార్లర్లలో కొన్ని ముఖ్యమైన ట్రీట్‌మెంట్లు ఈ సమయంలో తీసుకోకూడదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు రంగు

సాధారణంగా నేటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతోంది. తెల్ల జుట్టును దాచుకోవడానికి రంగు వేసుకుంటూ ఉంటారు. కానీ గర్భధారణ సమయంలో ఇది మంచిది కాదు. ఎందుకంటే గర్భిణీలకు హార్మోన్ల మార్పులు రావడం సహజం. అలాంటి సమయాల్లో చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రసాయనాలు కలిగిన రంగులు శరీరానికి మంచిది కాదు.

వ్యాక్సింగ్

గర్భధారణ సమయంలో వ్యాక్సింగ్ మంచిది కాదు. ఎందుకంటే ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది. ఈ సమయంలో కొన్ని చర్మ సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాక్సింగ్ కు దూరంగా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

బ్లీచ్

గర్భిణీలకు మాత్రమే కాదు, పదే పదే బ్లీచింగ్ చేసుకోవడం ఎవరికీ మంచిది కాదు. బ్లీచింగ్ చేసిన కొన్ని రోజుల తర్వాత చర్మం ముడతలు పడటం ప్రారంభమవుతుంది. అంతే కాదు, ఇలా పదే పదే చేయడం వల్ల చర్మ అలెర్జీలు, దురదలు వస్తాయి. కాబట్టి ఇలా చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అంతే కాకుండా గర్భిణీలు వీటికి బదులుగా మీరు తల, పాదాల మసాజ్ చేయించుకోవచ్చు. ఇది శరీరానికి, మనసుకు విశ్రాంతిని ఇస్తుంది. శరీరం కూడా తేలికగా మారుతుంది. కాబట్టి మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సి వస్తే, మసాజ్ చేయించుకోవడం మంచిది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందించాం. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.