Sugar in Milk: నవజాత శిశివులకు పాలల్లో పంచదార వేసి ఇస్తున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..

ప్రజలు ఆలోచించకుండా పాలలో చక్కెరను జోడించి పిల్లలకు క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటారు. చిన్న పిల్లలు రోజుకు చాలాసార్లు పాలు తాగుతారు. ఇలా పంచదార కలిపిన పాలుని తాగడం వలన పిల్లల శరీరానికి హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే విషయంపై ఆయుర్వేద, ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా అనేక విషయాలు వెల్లడించారు.

Sugar in Milk: నవజాత శిశివులకు పాలల్లో పంచదార వేసి ఇస్తున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..
Baby Health Care Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2024 | 11:41 AM

పిల్లలు, పెద్దలకు పాలు పోషకాహార నిధిగా పరిగణించబడుతున్నాయి. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ డి మంచి పరిమాణంలో లభిస్తాయి. ఈ పాలలో విటమిన్ బి12, మెగ్నీషియం, పొటాషియం మొదలైన పోషకాలు కూడా ఉన్నాయి. తల్లి పాలు పిల్లలకు మొదటి ఆహారంగా అందిస్తారు. క్రమంగా పిల్లలు పెద్ద ఎదిగే కొద్దీ ఆవు పాలుని ఇస్తారు. ఎందుకంటే పిల్లల సరైన శారీరక, మానసిక అభివృద్ధికి పోషకాలు చాలా ముఖ్యమైనవి. పిల్లల ఎముకలు, దంతాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు, ఎత్తు పెరగడానికి పాలు ఎంతగానో సహకరిస్తాయి. అయితే చాలా మంది పిల్లలకు పంచదార కలిపి ఇస్తున్నారు. అయితే ఇలా చేయడం పిల్లలకు ఎంత హాని చేస్తుందో తెలుసా..!

పెద్దలకు కూడా చక్కెరను తక్కువ పరిమాణంలో తినమని సలహా ఇస్తున్నారు. అయితే ప్రజలు ఆలోచించకుండా పాలలో చక్కెరను జోడించి పిల్లలకు క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటారు. చిన్న పిల్లలు రోజుకు చాలాసార్లు పాలు తాగుతారు. ఇలా పంచదార కలిపిన పాలుని తాగడం వలన పిల్లల శరీరానికి హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే విషయంపై ఆయుర్వేద, ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా అనేక విషయాలు వెల్లడించారు.

పాలలో పంచదార కలిపితే పోషకాహారం అందదు

ఇవి కూడా చదవండి

నిపుణుడు కిరణ్ గుప్తా మాట్లాడుతూ బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల పిల్లలకు బలం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే పాలను ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉన్న అద్భుతమైన వనరుగా భావిస్తారు. అయితే పాలలో చక్కెరను కలిపితే ప్రతిచర్య ఏర్పడుతుంది.. దీంతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలను అందించదు. ఇది కాకుండా కడుపులో నులి పురుగులు పెరుగుతాయి. దీని కారణంగా పిల్లల జీర్ణక్రియ క్షీణిస్తుంది. తరచుగా నీళ్ల విరేచనాల బారిన పడవచ్చు.

పిల్లల మానసిక స్థితిలో మార్పులు ఉండవచ్చు

పాలలో పంచదార కలపడం వల్ల పిల్లల శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాదు రోజూ పాలలో పంచదార కలిపి ఇవ్వడం వల్ల కొంతకాలం తర్వాత పిల్లలలో హైపర్ యాక్టివిటీ, చిరాకు, ఏడుపు వంటి సమస్యలు పెరుగుతాయి.

కడుపులో నులి పురుగులు పెరిగే అవకాశం

పిల్లల కడుపులో పురుగులు పెరుగుతున్న ఫిర్యాదులు తరచుగా వినిపిస్తున్నాయి. దీని వెనుక కారణం మురికి చేతులతో ఆహారం తీసుకోవడం, కలుషిత నీరు మొదలైనవి మాత్రమే కాదు చక్కెర కూడా కారణం ఉండవచ్చు. పిల్లలకు రోజూ పంచదార ఇవ్వడం వల్ల పురుగులు పెరుగుతాయి. దీని కారణంగా మలద్వారంలో దద్దుర్లు కూడా ఏర్పడతాయి. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. క్యాన్డ్ మిల్క్, ఇతర బేబీ కేర్ ప్రొడక్ట్స్, షుగర్ వంటి కృత్రిమ పదార్థాలను పిల్లలకు ఇవ్వకూడదని చెప్పారు. కనీసం పిల్లలకు రెండేళ్లపాటు చక్కెరను తినిపించవద్దని, కేక్‌ల వంటి వాటికి దూరంగా ఉంచాలని డాక్టర్ కిరణ్ గుప్తా చెబుతున్నారు.

ఏ ఆహారాలు పిల్లలకు మేలు అంటే

ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని పిల్లలకు అందించడానికి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మొదలైన వాటిని పిల్లలకు ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు గోధుమలను నానబెట్టి, మొలకలు చేసి, దానిని పొడిగా చేసి కొద్దిగా వేయించి ఆహారంగా అందించాలి. పిల్లల కోసం పప్పు,క్యారెట్ వంటి వాటికి ఈ పొడిని కలపండి ఆహారంగా తయారు చేసి పిల్లలకు ఇవ్వండి. ఇలా చేయడం పిల్లలకు మరింత పోషకాహారాన్ని అందిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..