- Telugu News Photo Gallery Teeth Whitening: 5 Foods you should avoid to maintain white color of your teeth
Teeth Whitening: ఆహారంలో వీటిని తీసుకుంటే మీ దంతాలు ఇలా మారిపోతాయ్! బీ కేర్ ఫుల్
ముత్యాల్లా మెరిసే పళ్ళు కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ దంతాల తెల్లదనాన్ని కాపాడుకోవడం అంత తేలికైన పని కాదు. రోజూ పళ్లు తోముకున్నా కూడా చాలా మంది పళ్లు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఇలా దంతాల రంగు మారడం వల్ల కూడా మొత్తం ఆరోగ్యం క్షీణిస్తుంది..
Updated on: Sep 11, 2024 | 12:39 PM

ముత్యాల్లా మెరిసే పళ్ళు కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ దంతాల తెల్లదనాన్ని కాపాడుకోవడం అంత తేలికైన పని కాదు. రోజూ పళ్లు తోముకున్నా కూడా చాలా మంది పళ్లు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఇలా దంతాల రంగు మారడం వల్ల కూడా మొత్తం ఆరోగ్యం క్షీణిస్తుంది.

దంతాల తెల్లదనాన్ని కాపాడుకోవడానికి, నోటి సంరక్షణతో పాటు ఆహార నియమాలు కూడా పాటించాలి. ఆహారపు అలవాట్ల వల్ల పంటి రంగు కూడా పోతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల దంతాల రంగు మారుతుందట. బ్లాక్ కాఫీ లేదా లిక్కర్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దంతాల మీద పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. బదులుగా గ్రీన్ టీ తాగడం మంచిది.

శీతల పానీయాలు దంతాలతోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. శీతల పానీయాలలో ఎక్కువ చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తాయి.

అలాగే రెడ్ వైన్ దంతాలకు మంచిది కాదు. ఈ పానీయంలో అనేక ఆమ్లాలు ఉంటాయి. ఇవి దంత క్షయాన్ని కలిగిస్తాయి. దంతాల తెల్లదనాన్ని దూరం చేస్తాయి. సోయా సాస్‌తో చేసిన ఆహారాలు దంతాలకు మంచివి కావు. సోయా సాస్ దంతాల రంగును మారుస్తుంది.

పొగాకు ఏ రూపంలో తీసుకున్నా దంతాలకు హానికరం. నిత్యం ధూమపానం చేసినా, పొగాకు తీసుకున్నా దంతాల మీద నల్లటి మరకలు ఏర్పడతాయి.




